వర్షం వచ్చుడే ఆలస్యం

Fri,July 12, 2019 11:36 PM

ఐదో విడుత హరితహారానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. వర్షం వచ్చుడే ఆలస్యం మొక్కలు నాటేందుకు సిబ్బంది గుంతలు తీసి పెడుతున్నారు. ఈ విడుతలో 2.75 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో 647 గ్రామ పంచాయతీలుండగా 549 నర్సరీలున్నాయి. ఆయా నర్సరీల్లో నాటేందుకు మొక్కలను సిద్ధం చేసి పెట్టారు. గ్రామాలకు వెళ్లే రోడ్లకు ఇరువైపులా నాటేందుకు దాదాపుగా 6 లక్షల వరకు 5 నుంచి 6 ఫీట్ల ఎత్తుగల మొక్కలు రెడీగా ఉంచారు. ఇప్పటికే కలెక్టర్ హనుమంతరావు పిలుపుమేరకు మొక్కల సంరక్షణకు పరిశ్రమల యాజమాన్యాలు ముందుకొచ్చాయి. జిల్లాలోని 16 వరకు ప్రధాన పరిశ్రమలు గ్రామాలను దత్తత తీసుకున్నాయి. అంతేకాకుండా హరితహారాన్ని విజయవంతం చేయాలనే పట్టుదలతో కలెక్టర్ అన్నిశాఖలకు టార్గెట్లు పెట్టారు. కాగా, పంచాయతీ రాజ్ కొత్త చట్టం ప్రకారం మొక్కల బాధ్యత పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌లకు మరింత బాధ్యత పెరుగనున్నది. - సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి

అంతరించుకుపోతున్న అటవీ సంపదను పెంచి పచ్చదనాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా హరితహారం కార్యక్రమం చేపడుతున్నది. ఈ కార్యక్రమం ద్వారా పెద్దఎత్తున మొక్కలు నాటి వాటి సంరక్షణకు నడుంకట్టింది.నాలుగేండ్లుగా ప్రతి ఏటా హరితహారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ యేడు ఐదో విడుత కోసం అధికారులు అంతా సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటేందుకు గుంతలు తీసిపెడుతున్నారు. ఓ స్థాయిలో మోస్తారు వర్షాలు కురిసిన వెంటనే మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విడుతలో జిల్లా వ్యాప్తంగా 2.75 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో 647 గ్రామ పంచాయతీలుండగా 549 నర్సరీలున్నాయి. ఆయా నర్సరీల్లో నాటేందుకు మొక్కలను సిద్ధం చేసి పెట్టారు. గ్రామాలకు వెళ్లే రోడ్లకు ఇరువైపులా నాటేందుకు దాదాపుగా 6 లక్షల వరకు 5 నుంచి 6 ఫీట్ల ఎత్తుగల మొక్కలను రెడీగా ఉంచారు. కాగా, కలెక్టర్ హనుమంతరావు పిలుపుమేరకు మొక్కల సంరక్షణకు పరిశ్రమల యాజమాన్యాలు ముందుకు వచ్చాయి. జిల్లాలోని 16 వరకు ప్రధాన పరిశ్రమలు గ్రామాలను దత్తత తీసుకున్నాయి. హరితహారాన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కలెక్టర్ గట్టి పట్టుదలతో ఉన్నారు. అన్నిశాఖలకు టార్గెట్లను పెట్టారు.

549 నర్సరీల్లో మొక్కలు సిద్ధం..
హరితహారంలో భాగంగా నాటేందుకు మొక్కలను అధికారులు సిద్ధంగా ఉంచారు. జిల్లాలో మొత్తం 647 గ్రామ పంచాయతీలున్నాయి. ప్రతి పంచాయతీలో తప్పకుండా నర్సరీ ఉండాలని ఆదేశాలున్న విషయం తెలిసిందే. అయితే పటాన్‌చెరు, జిన్నారం, కంగ్టి, నారాయణఖేడ్ వంటి ప్రాంతాల్లో పలు గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేయలేదు. పటాన్‌చెరులో స్థలం అందుబాటులో లేకపోవడంతో పాటు నీటి సౌకర్యం కూడా లేదు. కంగ్టి, నారాయణఖేడ్ ప్రాంతాల్లో నీటి సౌకర్యం లేని గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేయలేదు. జిల్లాలో మొత్తం 549 నర్సరీలుండగా వీటిలో నాటేందుకు 2.50 కోట్ల వరకు నాటేందుకు మొక్కలు సిద్ధంగా ఉంచారు. మరిన్ని అవసరమైతే ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రధానంగా గ్రామాలకు వచ్చి, వెళ్లే రహదారులకు ఇరువైపులా పచ్చదనం వెళ్లివిరిసేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు సిబ్బంది గ్రామాల రోడ్లకు ఇరువైపులా గుంతలు తీసి సిద్ధం చేస్తున్నారు. రోడ్ల పక్కన నాటేందుకు ప్రత్యేకంగా 6 లక్షల వరకు 5నుంచి 6 ఫీట్ల ఎత్తు ఉన్న మొక్కలు సిద్ధంగా ఉంచారు. తెల్లాపూర్‌లోని జీహెచ్‌ఎంసీకి సంబంధించిన నర్సరీ నుంచి కలెక్టర్ ప్రత్యేకంగా ఈ మొక్కలు తెప్పిస్తున్నారు. ఇప్పటికే 2 లక్షల పెద్ద మొక్కలను గ్రామాల్లోని నర్సరీలకు తరలించి అక్కడ సిద్ధంగా ఉంచారు.

శాఖల వారీగా టార్గెట్లు..
హరితహారంలో అన్ని శాఖలను భాగస్వామ్యం చేస్తున్నారు. ఈ ఐదో విడుతలో 2.75 కోట్ల మొక్కలు నాటాలని టార్గెట్ పెట్టుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని శాఖలకు టార్గెట్లు పెట్టారు. ప్రధానంగా అటవీ, డీఆర్‌డీఏ, పంచాయతీరాజ్, నీటిపారుదల, విద్య, వైద్యం, హోం, రోడ్లు భవనాలు, వ్యవసాయ శాఖలతో పాటు మిగతా అన్ని శాఖలకు టార్గెట్లు ఇచ్చారు. డీఆర్‌డీఏ, పంచాయతీరాజ్, అటవీ శాఖలకు ప్రధాన టార్గెట్లున్నాయి. హరిహారంపై ఇప్పటికే కలెక్టర్ హనుమంతరావు పలుమార్లు అధికారులతో సమీక్షించారు. ఆయా శాఖల జిల్లా అధికారులు బాధ్యత తీసుకోవాలని, నాటిని మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్ కూడా కలెక్టరేట్‌లో పరిశ్రమల యాజమాన్యాలతో పాటు అధికారులతో హరితహారంపై సమీక్షించిన విషయం తెలిసిందే.

మొక్కల సంరక్షణకు ముందుకొచ్చిన పరిశ్రమలు...
వ్యాపార దృక్పతమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా జిల్లాకు చెందిన పరిశ్రమలు మొక్కల సంరక్షణకు ముందుకొచ్చాయి. కలెక్టర్ పిలుపు మేరకు జిల్లాలోని అన్ని గ్రామాలను పరిశ్రమల యాజమాన్యాలు దత్తత తీసుకున్నాయి. జిల్లాలో 647 గ్రామ పంచాయతీలుండగా 16 ప్రధాన పరిశ్రమల యాజమాన్యాలు అన్ని గ్రామాలను దత్తత తీసుకున్నాయి. దాదాపు 12.50 కోట్ల వెచ్చించి ఆయా గ్రామాల్లో నాటిన మొక్కలను సంరక్షించనున్నారు. నాటిన మొక్కలను ట్రీగార్డులు ఏర్పాటు చేయడం కంపోస్ట్ ఎరువులు వేయడం, నాటిన తరువాత పెరిగే వరకు నీళ్లు పోయించడం వంటి బాధ్యతలను పరిశ్రమల యాజమాన్యాలు తీసుకున్నాయి. ఒక్కో పరిశ్రమ 20 నుంచి 50 గ్రామాలను దత్తత తీసుకున్నాయి. అరబిందో, మహీంద్రా అండ్ మహీంద్రా, పెప్సీ, కిర్బీ, యూబీ, ఎంఆర్‌ఎఫ్, ఏషియన్ పేయింట్స్, పెన్నార్, మైలాన్, న్యూలాండ్, గ్రాన్యూల్స్ ఇండియా, ఎంఎస్‌ఎన్, సిగ్నోల్, పిరమిడ్, రెడ్డీస్ ల్యాబ్స్, హెటిరో డ్రగ్స్ కంపెనీలు గ్రామాలను దత్తత తీసుకున్న వాటిలో ఉన్నాయి. కాగా మొక్కల సంరక్షణకు ముందుకు వచ్చిన పరిశ్రమల యాజమాన్యాలను ఆయా గ్రామాల ప్రజలు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.

పచ్చదనం లేకుంటే పదవికే ఎసరు...
పచ్చదనం పరిరక్షణపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టంలో పలు అంశాలను పొంది పరిచారు. కొత్త చట్టం ప్రకారం గ్రామాల్లో పచ్చదనం లోపిస్తే, నాటిన మొక్కలను సంరక్షించని క్రమంలో గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్‌తో పాటు గ్రామ పంచాయతీ సెక్రటరీల ఉద్యోగాలకు ఎసరు వచ్చే ప్రమాదం ఉన్నది. గ్రామాల్లో వేలాదిగా మొక్కలు నాటినప్పటికీ అవి ఎక్కడా పెగిరినట్లు కనిపించడం లేదని ఫిర్యాదులు అందితే సర్పంచ్, కార్యదర్శిలను తొలగించ వచ్చునని చట్టం చెబుతున్నది. ఈ క్రమంలో సర్పంచ్, కార్యదర్శులు మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుందని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు నమస్తే తెలంగాణ ప్రతినిధితో వెల్లడించారు. ఈ విషయంలో చాలా మందికి ఇంకా అవగాహన లేదని, ప్రత్యేక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు. మొక్కల సంరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...