జ్ఞానాన్ని పెంపొందించేది గురువులే


Sat,July 13, 2019 10:33 PM

-పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఎ.మాణయ్య
అందోల్, నమస్తే తెలంగాణ: తల్లిదండ్రులు జన్మనిస్తే...జ్ఞానాన్ని పెంపొందించి...సమాజానికి మంచి వ్యక్తులుగా పరిచయం చేసేది మాత్రం గురువులేనని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఎ.మాణయ్య అన్నారు. శనివారం జోగిపేటలోని బాలుర ఉన్నత పాఠశాలలో 1975-76 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాట్లాడుతూ నేను కూడా జోగిపేట ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నానని, ఇక్కడే 18 సంవత్సరాల పాటు ఉపాధ్యాయుడిగా పనిచేశానన్నారు. సమాజంలో ఎంత గొప్పవారైనా ఒక ఉపాధ్యాయుడిని మాత్రమే సార్ అని సంభోదించి గౌరవంగా పిలుస్తామన్నారు. గురువులను సన్మానించుకోవడం చాలా మంచి సంప్రదాయమని పూర్వ విద్యార్థులను అయన అభినందించారు. అనంతరం పూర్వ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు కరణం వెంకటేశం, నర్సింహులు, చంద్రమౌళి, ప్రభులింగంలను ఘనంగా సత్కరించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో కృష్ణ, పూర్వ విద్యార్థులు సత్యప్రకాశ్, ప్రభు ప్రకాశ్, దుర్వాసులు, చెన్నప్ప, వీరేశం, ఆర్.రవీందర్, శివరాజ్, పాండురంగం, రమేశప్ప పాల్గొన్నారు.

పాఠశాలకు రూ. లక్ష విరాళం
జోగిపేట ప్రభుత్వ పాఠశాలలో స్టేజీ నిర్మాణం కోసం పూర్వ విద్యార్థులు రూ.లక్ష విరాళంగా ప్రకటించారు. జోగిపేటకు చెందిన పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఎ.మాణయ్య తన తండ్రి అంజయ్య స్మారకార్థం రూ.50 వేలు విరాళం ప్రకటించగా, జోగిపేటకు చెందిన పూర్వ విద్యార్థి జయమ్ తన తండ్రి శెట్టి శివరావు స్మారకార్థం రూ.50 వేలను ప్రకటించారు. నూతనంగా మోడల్ భవనంగా నిర్మించిన పాఠశాలలో స్టేజీ లేకపోవడంతో పూర్వ విద్యార్థులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...