పద్మశాలీలు ఐక్యతను చాటాలి


Sat,July 13, 2019 10:37 PM

-గౌరవ అధ్యక్షుడు రాందాస్
సంగారెడ్డి అర్బన్, నమస్తేతెలంగాణ : పద్మశాలీ కుల బంధువులు బోనాల పండుగను ఘనంగా చేయాలని, త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఐక్యతను చాటి కౌన్సిలర్లను గెలిపించుకోవాలని పద్మశాలి సంఘం పట్టణ గౌరవ అధ్యక్షుడు రాందాస్ పిలుపునిచ్చారు. శనివారం సదాశివపేటలోని పాతకేరి పద్మశాలి సంఘం నెంబర్-1 కార్యవర్గ సమావేశం, యువజన సంఘం కార్యవర్గ సమావేశాన్ని ఈశ్వర మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆషాఢమాస బోనాల పండుగను అత్యంత వైభవంగా చేయాలని కోరారు. అలాగే పురపాలక సంఘం ఎన్నికల్లో పద్మశాలి కుల బంధువులు ఏకమై అత్యధిక వార్డు కౌన్సిలర్లను గెలిపించుకోవడంలో కీలకపాత్ర పోషించాలని కోరారు. సమావేశంలో పట్టణాధ్యక్షుడు పాసుగంటి మల్లేశం, ఉపాధ్యక్షుడు నక్క రాములు, మిరుగు యాదగిరి, యువశక్తి అధ్యక్షుడు గాజుల కృష్ణ, రమాకాంత్, రాజు, పండరి, చంద్రమోహన్, కాంతు తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...