అభినయం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది


Sat,July 13, 2019 10:38 PM

పటాన్‌చెరు రూరల్, నమస్తే తెలంగాణ: అభినయం ఆత్మవిశ్వాసం పెంచుతున్నదని గీతం అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్ అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని గాంధీ స్కూల్ ఆఫ్ హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ శనివారం నిర్వహించిన ఐదు రోజుల థియేటర్ వర్క్‌షాప్ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, సోషల్ సైన్సెస్ విద్యార్థులంతా కలిసి ఈ కార్యశాల్లో పాల్గొని, ఐదు రోజుల్లో నేర్చుకున్నదాన్ని స్కిట్ రూపంలో ప్రదర్శించడం ఎంతో ఆకట్టుకున్నదని విద్యార్థులను అభినందించారు. త్వరలోనే ఫొటోగ్రఫి కార్యశాలను కూడా ఏర్పాటు చేయనున్నట్టు విద్యార్థుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.

అధ్యాపకులతోనే కాకుండా బయటి నుంచి ఆయా రంగాలకు చెందిన నిపుణులను ఆహ్వానించి సందర్భానుసారం శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. అన్ని విభాగాల విద్యార్థులు కలిసి చేసే కార్యక్రమాలు మరిన్ని జరుపాలని ప్రొఫెసర్ శివప్రసాద్ కోరారు. నాటకరంగ శిక్షకురాలు సుప్రియా శుక్లా మాట్లాడుతూ గీతం విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ ఉందన్నారు. తాము ఇచ్చిన శిక్షణను విద్యార్థులు చక్కగా ఉపయోగించుకున్నారని కొనియాడారు. కార్యక్రమంలో గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్‌ఆర్ వర్మ, విద్యార్థి వ్యవహరాల సంచాలకుడు ప్రొఫెసర్ ఏ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...