టీఆర్‌ఎస్‌ బలపడింది


Sun,July 14, 2019 11:34 PM

-సీఎం కేసీఆర్‌ సంక్షేమ కార్యక్రమాలతోనేప్రజల్లో టీఆర్‌ఎస్‌పై విశ్వాసం
-మున్సిపాలిటీ ఎన్నికల్లో సత్తా చాటుతుంది..
-పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెన్నవరం భూపాల్‌రెడ్డి
రామచంద్రాపురం : రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ మరిత బలపడిందని ఎమ్మెల్సీ వెన్నవరం భూపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆర్సీపురం డివిజన్‌లోని డైమండ్‌ హోటల్‌ సమీపంలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఎమ్మెల్సీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలువురికి పార్టీ సభ్యత్వాలు ఇచ్చారు. పలు కాలనీల అధ్యక్షులకు పార్టీ సభ్యత్వం పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ఉద్యమంలా సాగుతున్నాయని తెలిపారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి పార్టీ సభ్యత్వాలు తీసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా టీఆర్‌ఎస్‌ అవతరిస్తుందన్నారు. రాష్ట్రంలో కోటి మంది వరకు టీఆర్‌ఎస్‌ సభ్యత్వాలు తీసుకుంటుండడంతో పార్టీ అజేయశక్తిగా ఎదుగుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు టీఆర్‌ఎస్‌ను ఆదరిస్తున్నారని చెప్పారు. టీఆర్‌ఎస్‌ని ప్రజలందరూ ఇంటి పార్టీగా భావిస్తున్నారని పేర్కొన్నారు. పేదల సంక్షే మం కోసం సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న కార్యక్రమాలకు ప్రజలు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌ వెంట నడుస్తున్నారని తెలిపారు. టీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో నెంబర్‌వన్‌ స్థానంలో నిలుస్తుందన్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడంలో టీఆర్‌ఎస్‌ సర్కార్‌ పూర్తిస్థాయిలో విజయం సాధించిందన్నారు. గ్రామాలు, పట్టణాలు టీఆర్‌ఎస్‌ సర్కార్‌ పాలనలో చాలా అభివృద్ధి చెందాయని తెలిపారు. ప్రతి గ్రామంలో రవాణ సౌకర్యం మెరుగుపడిందన్నారు. తాగునీటి స మస్యలు రాకుండా గో దావరి జలాలను ఇం టింటికీ తీసుకు వచ్చామన్నారు. సీఎం కేసీఆర్‌ సారథ్యంలో ప్రజలకు ఆదర్శవంతమైన పాలన అందుతుందన్నారు. ప్రజల కష్టా లు తెలిసిన ముఖ్యమంత్రి మనకు ఉండడం మనం చేసుకు న్న అదృష్టంగా భావించాల్సిన అవసరం ఉందన్నారు. త్వర లో జరుగబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో అన్ని మున్సిపాలిటీలపైన టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేయడం ఖాయమని తెలిపారు. ఎన్నికలు ఏవైనా విజయం టీఆర్‌ఎస్‌దేనని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ సభ్యత్వాలను జోరుగా సాగించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఆర్సీపురం, భారతీనగర్‌ డివిజన్ల అధ్యక్షులు పరమేశ్‌యాదవ్‌, దేవేంద్రాచారి, గ్రంథాలయ డైరెక్టర్‌ కు మార్‌గౌడ్‌, నాయకులు ఆదర్శ్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, వెంకట్‌లక్ష్మారెడ్డి, పాపయ్యయాదవ్‌, సత్యనారాయణ, యాదిరెడ్డి, కృష్ణకాంత్‌, యాదయ్య, సుంకుస్వామి, నరేందర్‌రెడ్డి, విఠల్‌, గోవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...