సభ్యత్వంలో ‘అందోల్‌' ముందున్నది


Sun,July 14, 2019 11:35 PM

-ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌
-సభ్యత్వం చేసిన పుస్తకాలు ఎమ్మెల్యేకు అందజేసిన నాయకులు
అందోల్‌, నమస్తే తెలంగాణ: టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశాల మేరకు చేపడుతున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ అన్నారు. ఆదివారం అందోలులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ సభ్యత్వాన్ని టీఆర్‌ఎస్‌ నాయకులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందోలు నియోజకవర్గానికి 50 వేల సభ్యత్వాన్ని నమోదు చేయాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించిందని, ఈ టార్గెట్‌ పూర్తయిందని, అదనంగా మరో 30 వేల సభ్యత్వాన్ని చేపట్టేందుకు పార్టీ నాయకులు గ్రామాల వారీగా పర్యటిస్తున్నారన్నారు. ముఖ్యంగా మహిళల సభ్యత్వాన్ని పెంచే దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు. పార్టీ సభ్యత్వం విషయంలో స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు రావడం హర్షణీయమన్నారు. జిల్లాలోని మిగతా నియోజకవర్గాల కంటే అందోలులోనే పార్టీ సభ్యత్వ నమోదు రికార్డు స్థాయిలో జరిగే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సీఎం కేసీఆర్‌ అందిస్తున్న సమర్థవంతమైన పాలనకు ప్రజలు స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని తీసుకునేందుకు ముందుకు వస్తున్నారన్నారని ఆయన పేర్కొన్నారు.

సభ్యత్వం చేసిన పుస్తకాలు ఎమ్మెల్యేకు అందజేత
అందోలు-జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో 5వేల టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వానికి లక్ష్యాన్ని ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ తెలిపారు. ఆదివారం అందోలులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపాలిటీకి సంబంధించిన సభ్యత్వ పుస్తకాలను, నగదును పట్టణ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు చాపల వెంకటేశం ఎమ్మెల్యేకు అందజేశారు. పార్టీ సభ్యత్వాలు ఇప్పటి వరకు ఎన్ని పూర్తి చేశారని ఎమ్మెల్యే అడుగగా, 3వేలకు వరకు సభ్యత్వం పూర్తిచేయడం జరిగిందని వెంకటేశం తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అనిల్‌ రాజ్‌, గాజులఅనిల్‌ కుమార్‌ తదితరులున్నారు.
రికార్డు స్థాయిలో సభ్యత్వాలు నమోదు కావాలి
వట్‌పల్లి: అన్ని గ్రామాల్లో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున్న సభ్యత్వాలు నమోదు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ అన్నారు. ఆదివారం వట్‌పల్లిలో మండల నాయకులతో సమావేశం నిర్వహించి సభ్యత్వ నమోదుపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గం వ్యాప్తంగా రికార్డు స్థాయిలో సభ్యత్వాలు నమోదు కావాలన్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పని చేసి అనుకున్న లక్షాన్ని పూర్తి చేయాలని పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందన్నారు.
పార్టీ కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్యే
అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొంది ఇంటికి చేరుకున్న పార్టీ కార్యకర్తను ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ ఆదివారం పరామర్శించారు. గొర్రెకల్‌కు చెందిన రవీందర్‌రెడ్డి గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లో చికిత్స పొందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డితో మాట్లాడి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర కార్యదర్శి భిక్షపతి, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ అశోక్‌గౌడ్‌, మాజీ ఎంపీపీ పత్రి విఠల్‌, కోఆప్షన్‌ సభ్యుడు కుత్బోద్దీన్‌, నాయకులు జగదీశ్వర్‌, శ్రీశైలం, జానయ్య, శ్రీనివాగౌడ్‌, బుద్ధిరెడ్డి, శివాజీరావు, బస్వరాజ్‌, వెంకట్‌రెడ్డి, రాజేశ్వర్‌గౌడ్‌, ప్రభాకర్‌, ఇస్మాయిల్‌, వీరేశం పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...