రైలు బండి


Sun,July 14, 2019 11:38 PM

-‘చైల్డ్‌ ఫ్రెండ్లీ ఎక్స్‌ప్రెస్‌' స్కూల్‌..!
-తడ్కల్‌లో రైలు తరహా పాఠశాల
-నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన ఇన్‌చార్జి హెచ్‌ఎం
కంగ్టి : ప్రతి సంవత్సరం విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వినూత్నంగా తరగతి గదులను రైలుబండిలా పెయింటింగ్‌ వేయించారు. జిల్లాలోనే మారుమూల ప్రాంతమైన కంగ్టి మండలంలో అక్షరాస్యత శాతం అంతంత మాత్రమేనని చెప్పుకోవచ్చు. ఇందుకు తోడు ప్రైవేట్‌ పాఠశాలలు పుట్టగొడుగుల్లా వ్యాపించడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా తగ్గిపోతుంది. ఇది గమనించిన పాఠశాల హెచ్‌ఎం సంతోష్‌రెడ్డి వినూత్నంగా ఆలోచించి విద్యార్థులను ఆకర్షించేలా రైలుబండి పెయింటింగ్‌ను వేయించారు. దీంతో పాఠశాల ప్రస్తుతం ఈ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. ఐదు తరగతులున్న ఈ పాఠశాలలో నాల్గో తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం కూడా ఉంది. 91 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. రైలుబండిను చూసి ప్రైవేట్‌ పాఠశాల విద్యార్థులు సైతం ఈ పాఠశాలలో చదవుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

చైల్డ్‌ ఫ్రెండ్లీ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం...
రైలుబండిలా పెయింటింగ్‌ వేసిన తరువాత దీనికి చైల్డ్‌ ఫ్రెండ్లీ ఎక్స్‌ప్రెస్‌గా పాఠశాల హెచ్‌ఎం నామకరణం చేశారు. పాఠశాల 1972లో ప్రారంభం కావడంతో రైలు నెంబర్‌ను 1972గా వేయించారు. నిజామాబాద్‌ జిల్లా కొటగిరికి చెందిన పెయింటర్‌ చందును పిలిపించి ఐదు తరగతులున్న పాఠశాలకు ఈ పెయింటింగ్‌ను వే యించినట్లు హెచ్‌ఎం తెలిపారు. దీనికి గాను మొ త్తం రూ.30 వేలు ఖర్చు కాగా ఆయన తన సొంత డబ్బులతో పెయింటింగ్‌ వేయించారు. రైలుబండి ఇంజిన్‌ ఆకారంలో బ్లాక్‌బోర్డును ఏర్పాటు చేశారు. ఎంతో చూడముచ్చటగా కనిపిస్తున్న రైలు ఆకారాన్ని పోలి ఉన్న పాఠశాలలో చదువుకునేందుకు విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 30మంది ప్రైవేట్‌ విద్యార్థులు తమ పాఠశాలలో అడ్మిట్‌ అయ్యారని హెచ్‌ఎం వెల్లడించారు. ఇంకా చాలావరకు అడ్మిషన్లు పెరిగే అవకాశముందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేవలం హెచ్‌ఎం మాత్రమే ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా మిగతా ఆరు మంది విద్యావలంటీర్లుగా ఉన్నారు.

113
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...