నేడు ఖండగ్రాస చంద్ర గ్రహణం


Tue,July 16, 2019 03:47 AM

సంగారెడ్డి మున్సిపాలిటీ : ఖండగ్రాస చంద్రగ్రహణం ఈ నెల 16న మంగళవారం రాత్రి ప్రారంభంకానున్నది. స్పర్శకాలం మంగళవారం రాత్రి 1.34 గంటల నుంచి మధ్యకాలం 3.02 గంటల వరకు, మోక్షకాలం అనగా మరుసటి రోజు బుధవారం (విడుచుట) 4.30 గంటల వరకు ఉంటుంది. ఈ ఖండగ్రాస చంద్రగ్రహణం రోజు రాత్రి 9 గంటల వరకు చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు భోజనాలు చేయాలని, గ్రహణం ఉన్నప్పుడు భోజనం చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు. గర్భిణీలు గ్రహణం రోజు రాత్రి 11.30 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5.30 గంటల వరకు గ్రహణవేద పాటించాలని పండితులు చెబుతున్నారు. శ్రవణ నక్షత్రం, ఉత్తరాషాడ నక్షత్రం, ధనుస్సురాశి, మకర రాశి జాతకులకు దోష ప్రభావం ఉంటుందన్నారు. ఖండగ్రాస చంద్రగ్రహణం రోజు మంగళవారం మధ్యాహ్నాం 1 గంట నుంచి మరుసటి రోజు బుధవారం ఉదయం 6 గంటల వరకు అన్ని దేవాలయాలు మూసి ఉంటాయని, బుధవారం 7 గంటలకు యధావిధిగా ఆలయాలు తెరుచుకుంటాయని వైకుంఠపురం ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యులు తెలిపారు. ముఖ్యంగా గర్భిణీలు, వృద్ధులు, చిన్నారులు గ్రహణ సమయం నుంచి గ్రహ ణం ముగిసే వరకు ఎట్టి పరిస్థితిలోనూ ఇంట్లో నుంచి బయటకు రావొద్దని అర్చకులు తెలిపారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...