లోక్ అదాలత్‌తో సత్వర, సమ న్యాయం


Sat,July 13, 2019 11:00 PM

సంగారెడ్డి టౌన్ : జాతీయ లోక్ అదాలత్‌లో ఉమ్మ డి మెదక్ జిల్లా పరిధిలో 3,663 కేసులను పరిష్కరించి రూ.2,29,42,509 నగదు రికవరీ చేశామని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.సాయిరమాదేవి అన్నారు. శనివారం పట్టణంలోని జిల్లా కోర్టులో జాతీయ న్యాయసేవాధికార సంస్థ న్యూఢిల్లీ ఉత్తర్వుల మేరకు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.భవాని ఆధ్వర్యంలో జాతీయలోక్ అదాలత్ నిర్వహించారు. జాతీయ లోక్‌అదాలత్‌కు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. లోక్ అదాలత్‌ల ముఖ్య ఉద్దేశం రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకునేందుకు సత్వర న్యాయం- సమన్యాయం కోసం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. లోక్ అదాలత్‌లో న్యాయవివాదాలను పరిష్కరించుకునేందుకు కక్షిదారులకు వీలు ఉంటుందని, న్యాయ స్థానాల్లో సివిల్, క్రిమినల్ కేసులను కక్షిదారుల ఆమో దం మేరకు రాజీ పద్ధతితో పరిష్కరించుకోవడానికి వీలుగా న్యాయసేవాధికార సంస్థ లోక్ అదాలత్ బెంచ్‌లను ఏర్పాటు చేస్తుందని వివరించారు.

కక్షిదారులు వారి ఆస్తి తగాదాలు, మోటర్ వెహికల్ ప్రమాద నష్టపరిహారం, భాగస్వాముల పరిష్కార కేసులు, విద్యుత్ చౌర్యం, క్రిమినల్ కాంపౌండబుల్, బ్యాంకు రికవరీ కేసులు, టెలీఫోన్ రికవరీ, కుటుంబ సంబంధ కేసులు, చెక్ బౌన్స్ తదితర అన్ని రకాల కేసులు రాజీ మార్గాన పరిష్కరించుకునే కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కరిస్తామని తెలిపారు. కంది మండలంలోని ఓడీఎఫ్‌లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు రూ.31,87 వేల నష్టపరిహారం అందించారు. ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా అన్ని కోర్టుల్లో మొత్తం 3,663 కేసులను పరిష్కరించారు. సివిల్ కేసులు 17, ఎంవీవోపీ కేసులు 35, క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు 1100, 138 ఎన్‌ఐ యాక్టు కేసులు 10, బ్యాంకు రికవరీ కేసులు 47, విద్యుత్ చౌర్యం కేసులు 2448, టెలీఫోన్ కేసు లు 3, ఎల్‌ఏవోపీ కేసులు 3 మొత్తం 3,663 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి తెలిపారు. వాటికి సంబంధించి రూ. 2 కోట్ల 29లక్షల42వేల 509లు నష్టపరిహారం రికవరీ చేసినట్లు వివరించారు. లోక్‌అదాలత్‌లో 1వ అదనపు జిల్లా న్యాయమూర్తి బి.పాపిరెడ్డి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి భవాని, సీనియర్ సివిల్ జడ్జీ ఎం.శ్యాంశ్రీ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎండి జలీల్ అహ్మద్, అదనపు ప్రథమశ్రేణి జడ్జి ఎం.కల్పన, సెకెండ్‌క్లాస్ మెజిస్ట్రేట్ ప్రభాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి, పీపీ నర్సింగ్‌రావు, పోలీసు అధికారులు, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...