జోరుగా గులాబీ దండు సభ్యత్వం


Sat,July 13, 2019 11:00 PM

మిరుదొడ్డి : సీఎం కేసీఆర్ ప్రవేశ పెడుతున్న పలు సంక్షేమ పథకాల మూలంగానే టీఆర్‌ఎస్ పార్టీకి గ్రామాల్లో ఎక్కడా లేని విధంగా అధికంగా స్పందన లభిస్తున్నదని ఎంపీపీ గజ్జెల సాయిలు, టీఆర్‌ఎస్ పార్టీ మిరుదొడ్డి మండల అధ్యక్షుడు లింగాల వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం మిరుదొడ్డిలో టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కొనసాగించారు. అనంతరం మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ వద్ద రహదారి పై ప్రమాదకరంగా ఉన్న గుంతలను, గ్రామంలోని గుంతలను శ్రమదానం చేసి టీఆర్‌ఎస్ పార్టీ నేతలు పూడ్చి వేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ, పార్టీ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రజలు ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకొని ఇతరులకు సహాయం చేయాలన్నారు. గ్రామాల్లో ఎవైనా చిన్న సమస్యలు ఉంటే ప్రజలు సహృదయంతో సమిష్టిగా శ్రమదానం చేసి అట్టి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మోతె గ్రామ సర్పంచ్ కాలేరు శ్రీనివాస్, టెలికం బోర్డు జిల్లా కమిటీ సభ్యుడు సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్ గొట్టం బైరయ్య, సూకురి లింగం, చిప్ప శివ కుమార్, టీఆర్‌ఎస్ నేతలు కానుగంటి శ్రీనివాస్, ఎల్ముల శేఖర్, ధర్మారం కుమార్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...