హాలియాను అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తా


Sat,July 13, 2019 01:54 AM

నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య
హాలియా, నమస్తే తెలంగాణ : హాలియా మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అన్నారు. శుక్రవారం పట్టణంలోని డ్రైనేజీ కాల్వల అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం పేరూరు మేజర్‌లో పూడికతీత పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గానికి తలమానికంగా ఉన్న హాలియా 30ఏండ్లుగా పూర్తిగా నిర్లక్ష్యానికి గురై ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. పేరూరు మేజర్‌తోపాటు హాలియాలో ఉన్న మురుగుకాల్వ సమస్య పరిష్కారానికి పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. ఆయన వెంట జడ్పీ వైస్‌చైర్మన్ ఇరిగి పెద్దులు, టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు మలిగిరెడ్డి లింగారెడ్డి, ఎంపీపీ పేర్ల సుమతిపురుషోత్తం, నోముల భగత్, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాసస్వామి, పార్టీ మండలాధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, నాయకులు చెరుపల్లి ముత్యాలు, చల్లా మట్టారెడ్డి, వర్ర వెంకట్‌రెడ్డి, మాధవరం నరేందర్‌రావు, నలబోతు వెంకటయ్య, కొమ్మబోయిన చంద్రశేఖర్‌గౌడ్, రభి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...