కేసీఆర్‌పై నమ్మకంతోనే తిరిగి టీఆర్‌ఎస్‌కు పట్టం


Sun,July 14, 2019 01:36 AM

కోదాడ, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్ పాలనే రాష్ర్టానికి శ్రీరామరక్ష అని భావించిన ప్రజలు ఆయనపై నమ్మకంతో తిరిగి టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారని విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం కోదాడ పురపాలక సంఘ పరిధిలో పార్కు, సింగిల్‌ఆర్మ్ లైటిం గ్ సిస్టమ్, ట్రాఫిక్ సిగ్నల్ కంట్రోల్ సిస్టమ్, శానిటేషన్ ట్రాలీలతో పాటు మండల పరిధిలోని దోరకుంట వద్ద 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌తో పాటు అనంతగిరి మండలంలో బీటీ రోడ్డును ఆయన ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్యే బొ ల్లం మల్లయ్యయాదవ్‌తో కలిసి ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇప్పటి వరకు సాగు నీరందని బీడు భూములను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసేందుకు ఈ ప్రాజెక్టు ఉపకరిస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం విమర్శకులు సైతం అభినందించారని, భవిష్యత్‌లో గోదావరి జలాలే తెలంగాణ ప్రజలకు శరణ్యమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంఘాల పరిధిలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

మున్సిపాలిటీ పరిధిలో విశాలమైన పార్కుల ఏర్పాటులో భాగంగా కోదాడలో రెండు ఎకరాల స్థలంలో పార్కును ప్రారంభించుకున్నామన్నారు. కోదాడ పట్టణం ఇప్పటికే రూ. 40 కోట్లతో అభివృద్దిలో అగ్రభాగాన ఉందన్నారు. తె లంగాణకు ముఖద్వారమైన కోదాడ మున్సిపాలిటీని అందమైన సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గ అభివృద్దికి తన వంతు సహకారాన్ని అందిస్తానన్నారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి జగదీష్‌రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై ఉంచిన బాధ్యతను నూటికి నూరు శాతం నెరవేరుస్తానని ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమాల్లో రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని వెంకటరత్నంబాబు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎండి మహబూబ్‌జానీ, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ వంటిపులి అనిత నాగరాజు, పట్టణ అధ్యక్షుడు కుక్కడపు బాబు, గట్ల కోటేశ్వరరావు, కోదాడ, నడిగూడెం, మోతె ఎంపీపీలు చింతా కవితారెడ్డి, యాతాకుల జ్యోతి, ముప్పాని ఆశ, జడ్పీటీసిలు కృష్ణకుమారి, బొలిశెట్టి శిరీష, కొణతం ఉమ, కమీషనర్ మల్లారెడ్డి, విశ్రాంత ఇంటర్ బోర్డు అధికారి నెమ్మాది ప్రకాష్‌బాబు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...