‘పేట’ మార్కెట్‌లో తీరనున్న రైతుల కష్టాలు


Mon,July 15, 2019 02:46 AM

-రూ.1.5 కోట్లతో గాల్‌వాల్యూమ్‌ షెడ్‌ నిర్మాణం
-ప్రారంభమైన నిర్మాణ పనులు..4 నెలల్లో పూర్తి
-వర్షం నుంచి ధాన్యం రక్షణకు ఉపయోగం
సూర్యాపేట వ్యవసాయం : సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం తీసుకొచ్చే రైతుల అవసరాల కోసం గాల్‌వాల్యూమ్‌ షెడ్‌ నిర్మాణానికి పనులు జరుగుతున్నా యి. మార్కెట్‌లో ఇప్పటికే షెడ్లు ఉన్నప్పటికీ సీజన్‌లో అధిక ధాన్యం వచ్చినప్పుడు ధాన్యానికి ఎటువంటి రక్షణ లేకపోవడంతో, వర్షానికి ధాన్యం తడవడం, వరదకు కొట్టుకొనిపోవడం అప్పుడప్పుడు జరుగుతుంది. దీంతో తడిసిన ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేయడం, రైతులు మద్దతు ధర కోసం ధర్నా చేయడం లాంటి అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి సమస్యలను పునరావృతం కాకుండా ఈ నూతన షెడ్డును నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే దాదాపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తీరనున్నాయి.

సామర్థ్యానికి మించి రావడంతోనే..
జిల్లా నుంచే కాక ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు అమ్మకానికి ప్రతిరోజూ సుమారు 10వేల బస్తాల నుంచి 75వేల బస్తాలకు పైగా ధాన్యం వస్తుంది. 25 వేల బస్తాల ధాన్యం వచ్చినప్పుడు ఎటువంటి సమస్య ఉండదు. కాన్ని కొన్ని సమయాల్లో అధికంగా వచ్చినప్పుడు రైతులు ఆరుబయట ఖాళీ స్థలాలల్లోనే పోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రైతుల ఇబ్బందులను తీర్చేందుకు ఈగాల్‌వాల్యూమ్‌ షెడ్డును నిర్మిస్తున్నారు.
ముమ్మరంగా షెడ్డు నిర్మాణ పనులు
మార్కెట్‌లో ఇప్పటికే 10 మార్కెట్‌ యార్డులు ఉన్నా యి. వాటికి అను సంధానంగా నూతనంగా రూ.1.50 కోట్లతో గాల్‌వాల్యూమ్‌ షెడ్డు నిర్మాణానికి శ్రీకారం చు ట్టారు. నిర్మాణానికి సంబంధించి అన్ని అనుమతులు రావడంతో నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నా యి. ఇప్పటికే పునాదులు పూర్తి చేసి పునాదులకు సమానంగా మట్టితో లెవల్‌ చేశారు. త్వరలో పిల్లర్లు వేసి మిగతా పనులను 4 నెలల్లో పూర్తి చేయనున్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...