ముగిసిన జిల్లా స్థాయి ఇన్విటేషన్‌ కబడ్డీ పోటీలు


Mon,July 15, 2019 02:47 AM

హుజూర్‌నగర్‌, నమస్తేతెలంగాణ : హుజూర్‌నగర్‌లోని బాలుర ఉన్నత పాఠశాలలో అంకిరెడ్డి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరుగుతున్న ఇన్విటేషన్‌ జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ పోటీల్లో ప్రథమ బహుమతిని నూతనకల్‌ చేజిక్కించుకుంది. ద్వితీయ బహుమతి అనంతగిరి, తృతీయ బహుమతి చిలుకూరు, నాలుగో బహుమతి మునగాల, ఐదో బహుమతి నేరేడుచర్ల, ఆరో బహుమతి తుంగతుర్తి గెలుపొందాయి. విజేతలకు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు, అంకిరెడ్డి ఫౌండేషన్‌ చైర్మన్‌ శానంపూడి సైదిరెడ్డి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో కబడ్డీ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ సురేందర్‌రెడ్డి, కోదాడ డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ దొంతగాని శ్రీనివాస్‌గౌడ్‌, మారిపెద్ది శ్రీనివాస్‌, ఎంపీపీ గూడెపు శ్రీను, అ ట్లూరి హరిబాబు, కబడ్డీ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు రామచంద్రగౌడ్‌, నరసింహారావు, లాల్‌మదార్‌, ఇమామ్‌, వెంకటేశ్వర్లు, నాగిరెడ్డి, సునీల్‌, అలీ, మోహన్‌రెడ్డి, సైదులు, గఫార్‌, వెంకట్‌రెడ్డి, ప్రదీప్‌, మస్తాన్‌ పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...