సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ


Tue,July 16, 2019 05:09 AM

రామగిరి : రాష్ట్రంలో పేద ప్రజలకు సీఎం కేసీఆర్ అందిస్తున్న సహాయంలో నల్లగొండ నియోజకవర్గ ప్రజలు రాష్ట్రంలోనే అత్యధికంగా వినియోగించుకున్నారని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. అనారోగ్యంతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్సపొందిన 163 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చిన రూ.55,74,500 చెక్కులను సోమవారం నల్లగొండలోని ఎమ్మెల్యే నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డితో కలిసి ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంచర్ల మాట్లాడుతూ తాను శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత 750మందికి ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకున్నారని ఇందులో 405మందికి రూ. 1,87,18,400 చెక్కుల రూపంలో, ఎల్‌వోసీ రూపంలో అందించామన్నారు. ఇందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ఆర్‌వో మాలే శరణ్యారెడ్డి, కనగల్ ఎంపీపీ కరీంపాష, నల్లగొండ టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు అబ్బగోని రమేష్‌గౌడ్, నాయకులు చీరపంకజ్‌యాదవ్, కటికం సత్తయ్యగౌడ్, వంగాల సహదేవరెడ్డి, దేప వెంకటరెడ్డి, బకరం వెంకన్న, ఐతగోని యాదయ్య, పాశం సంపత్‌రెడ్డి, దొడ్డి రమేష్, కందుల లక్ష్మయ్య, మందడి సైదిరెడ్డి, కనగల్ వైస్ ఎంపీపీ రామగిరి శ్రీధర్‌రావు, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...