ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యం


Tue,July 16, 2019 05:13 AM

హాలియా, నమస్తే తెలంగాణ/నందికొండ: రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి రూపాయి ఖర్చు లేకుండానే ఉచిత వైద్యం అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం నందికొండలో రూ.18కోట్లతో నిర్మించిన కమలానెహ్రూ వంద పడకల దవాఖానాను విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి ఈటెల మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అభివృద్ధి కుంటుపడుతుందని ఆంధ్ర పాలకులు, ఆంధ్ర పత్రికలు ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించారన్నారు. తెలంగాణ వస్తే చీకట్లు కమ్ముకుంటాయని, ఎడారిగా మారుతుందని అన్న వలసపాలకుల కుట్రను ఛేదించి సీఎం కేసీఆర్ మా బతుకులు.. మేమే బతుకుతాం అని మా తెలంగాణ మాకు కావాలని కొట్లాడి తెచ్చుకున్నాం.. దేశ చరిత్రలోనే గొప్ప నాయకుడిగా సీఎం కేసీఆర్ నిలిచిపోయారన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టారన్నారు. వ్యవసాయానికి 7గంటల అరకొర విద్యుత్‌ను ఇచ్చి అందులో రాత్రి 3గంటలు, పగలు 3గంటలతో రైతులు తీవ్రఇబ్బందులు పడ్డారని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 24 గంటలు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. రైతులు పడ్డ కష్టాలన్నీ సీఎం కేసీఆర్ తీర్చారన్నారు. గర్భిణులకు అంగన్‌వాడీల ద్వారా పౌష్టిహారంతో పాటు సీఎం కేసీఆర్ కిట్టుతో రూ.12వేల నగదు అందజేస్తున్నారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలుకానీ సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు అవుతున్నాయన్నారు. కార్పొరేట్ వైద్యాన్ని జిల్లా కేంద్రాల్లో అందించే విధంగా నల్లగొండ, సూర్యాపేటల్లో మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయడం జరిగిందని, అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో ఆరోగ్యశ్రీ, జీహెచ్‌ఎస్ వైద్య సేవలను ప్రారంభిస్తామన్నారు. జిల్లాలోని ఫ్లోరైడ్ రక్కసిని తరిమికొట్టేందుకు హైదరాబాద్ బంజారాహిల్స్ నుంచి గిరిజన తండాల వరకు మిషన్ భగీరథ నీటిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం సరఫరా చేస్తుందన్నారు. రాష్ట్ర విద్యాశాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఆడబిడ్డను పురిటిలోనే వదిలించుకోకుండా డెలీవరి వరకు 15 రకాల వస్తువులతో కేసీఆర్ కిట్టును ఇవ్వడంతో పాటు రూ.12 వేలు నగదు, రైతుబంధు కింద ఏటా ఎకరాకు రూ.10 వేలు పెట్టుబడి ఇచ్చి, రైతు బీమా పథకం కింద రూ.5లక్షలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్నారు. నెల్లికల్లు లిఫ్టును త్వరలోనే మంజూరు చేయించి స్వయంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. లిఫ్టు ఏర్పాటుకు కావాల్సిన 10 ఎకరాల భూమిని సైతం గుర్తించామన్నారు.

మంత్రులకు ఘనస్వాగతం
హిల్‌కాలనీ కమలానెహ్రూ ఏరియా దవాఖానకు చేరుకున్న మంత్రులు రాజేందర్, జగదీష్‌రెడ్డిలకు డీఎంహెచ్‌ఓ కొండల్‌రావు, వైద్యా విధానపరిషత్ జిల్లా సూపరింటెండెంట్ నర్సింగరావు, సీఎంఓ అమృత నాయక్‌లు పుష్పగుచ్చంతో, అర్చకులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, వైస్‌చైర్మన్ ఇరిగి పెద్దులు, ఆర్డీఓ జగన్నాథరావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కృష్ణకుమారి, తసీల్దార్ ప్రేమ్‌కుమార్, ఎంపీడీఓ రఫీఖున్నీసాభేగం, పెద్దవూరజడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, పెద్దవూర ఎంపీపీ అనురాధ సుందర్‌రెడ్డి, తిరుమలగిరి ఎంపీపీ భగవాన్‌నాయక్, పార్టీ నందికొండ మున్సిపాలిటీ ఇన్‌చార్జి కర్న బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర నాయకుడు ఎంసీ కోటిరెడ్డి, కర్నాటి విజయభాస్కర్‌రెడ్డి, మల్గిరెడ్డి లింగారెడ్డి, పట్టణాధ్యక్షులు కంచర్ల సుధీర్‌కుమార్, సల్లోజు శేఖరాచారి, రమేష్‌జీ, బత్తుల సత్యనారాయణ, ఇర్ల రామకృష్ణ, రామ్మోహన్‌రావు, కారంపుడి విష్ణుమూర్తి, గౌస్, సత్యనారాయణరెడ్డి, చంద్రయ్య, కాటుకృష్ణ, చంద్రమౌలి, సుందర్‌రెడ్డి, మన్సూర్, మందశాంత కుమారి, కోట్ల సైదులు పాల్గొన్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...