పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండాలి


Mon,July 15, 2019 11:38 PM

కులకచర్ల : పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి పని చేయాలని కులకచర్ల ఎంపీపీ మూడావత్ సత్యమ్మహరిచ్ఛంద్ర, జడ్పీటీసీ రాందాస్‌నాయక్ పేర్కొన్నారు. సోమవారం పంచాయతీ కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్యదర్శులు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలన్నారు. గ్రామాల్లో ప్రజలు వివిధ సమస్యలతో మండల కేంద్రానికి వచ్చి ఇబ్బందులు పడుతున్నారని మండల కేంద్రానికి ప్రజలు రాకుండా గ్రామాల్లోనే వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించినప్పుడే మంచి గుర్తింపు ఉంటుందని వివరించారు.

ముఖ్యంగా గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని, మురుగునీటి కాల్వలను పరిశుభ్రం చేయించి ప్రజలు వివిధ వ్యాధుల బారీన పడకుండా చూడాలని తెలిపారు. ప్రభుత్వం ద్వారా వచ్చే వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేవిధంగా చూడాలని తెలిపారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా పంచాయతీ కార్యదర్శులు వ్యవహరించరాదని తెలిపారు. మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఈవోపీఆర్డీ సురేశ్‌బాబు, వైస్ ఎంపీపీ రాజశేఖర్, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...