ప్రజావాణి సమస్యలను సత్వరమే పరిష్కరించాలి


Mon,July 15, 2019 11:41 PM

-జిల్లా రెవెన్యూ అధికారి ఉషారాణి
రంగారెడ్డి జిల్లా, నమస్తే తెలంగాణ : ప్రజావాణికి వచ్చే విజ్ఞప్తులను పరిశీలించి సత్వర మే పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి ఉషారాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశం మందిరంలో ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ.. ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. పరిష్కరించిన వాటిని ప్రజావాణి పోర్టల్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలన్నారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై ౫౫ ఫిర్యాదులు వచ్చాయి. అయితే రాజేంద్రనగర్ మండలం ఉప్పర్‌పల్లిలోని సర్వే నంబర్ ౩౬ వివాదం పరిష్కరించాలని బాధితులు కోరారు. డబుల్ బెడ్రూం ఆ స్థలం కేటాయించాలని కోరారు.చింతల్‌మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నర్సింగ్ రావు ప్రభుత్వ భూమిని కాపాడాలని విజ్ఞప్తిచేశారు. గత ప్రభుత్వం హయాంలో స్వచ్ఛందసంస్థలకు ౧౨ ఎకరాల భూమి ప్రభుత్వం నుంచి తీసుకున్నారని, ఆ భూమిని ప్రస్తుతం ఆ స్థలం దక్కించుకున్న వ్యక్తులు ప్లాట్లుగా విభజించి విక్రయిస్తున్నారని డీఆర్వో ఉషారాణి దృష్టికి తీసుకువచ్చారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

టీఎస్ స్టడీ సర్కిల్‌లో శిక్షణ పొందిన అభ్యర్థులకు ఉద్యోగాలు
రంగారెడ్డి జిల్లా, నమస్తే తెలంగాణ : టీఎస్ స్టడీ సర్కిల్‌లో శిక్షణ పొందిన అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారని టీఎస్‌ఎస్‌సీ గౌరవ డైరెక్టర్ సుచితరాయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షల కోసం ఇచ్చిన శిక్షణను సద్వినియోగం చేసుకుని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని చెప్పారు. మొత్తం స్టడీ సర్కిల్ ద్వారా ౨౫పోస్టులు సాదించారన్నారు. ఉచిత శిక్షణతోపాటు స్టడీ మెటీరియల్ ఇస్తూ ఉచిత భోజనం వసతి కల్పించడం జరిగిందన్నారు. పలువురు పోటీ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారని వెల్లడించారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...