తాండూరు అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ


Mon,July 15, 2019 11:47 PM

తాండూరు, నమస్తే తెలంగాణ : తాండూరు నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. సోమవారం వికారాబాద్‌లో మైన్స్, డీఆర్‌డీఏ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ప్రత్యే క సమావేశం నిర్వహించారు. డీఎంఎఫ్‌టీలోని రూ. ౨౧.౯౬కోట్ల నిధులతో ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారు. తాండూరు మున్సిపల్ పరిధిలో రోడ్లు, కాలుష్య నివారణకు రూ. ౩.౫౦కోట్లు, మున్సిపల్ శివారు ప్రాంతంలో ని రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, ఎన్‌టీఆర్ కాలనీల అభివృద్ధికి రూ. ౨.౫౦కోట్లు, జిల్లా దవా ఖానకు రూ. ౪౦లక్షలు, రెండు అంబులెన్స్‌లకు రూ. ౨౪లక్షలు, కరణ్‌కోట్, బషీరాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి రూ. ౧౦ లక్షలు, నియోజకవర్గంలోని మండలాల స్కూల్ భవనాలు, స్కిల్ డౌలప్‌మెంట్ భవనాలకు రూ. ౨కోట్లు, పాత తాండూరులో దవాఖాన నిర్మాణా నికి రూ. ౫౦లక్షలు, అదనపు పాఠశాల భవన నిర్మాణాలకు రూ. ౨౦లక్షలతో పాటు పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. త్వర లో కలెక్టర్ ఆమోదం, మంజూరుకు ప్రతిపాదనలను అందజేయనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహకారంతో తాండూరు అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు.

తాండూరులో నెలకొన్న కాలు ష్య నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి మొక్క లు నాటడం, పార్కుల ఏర్పాటుతో పాటు పలు కార్యక్రమాలు చేస్తామన్నారు. అందుకు వివిధ శాఖల అధికారులు, నేతలు సహకరించాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో అధికారులు నిర్లక్ష్యం చేయకుండా అర్హులందరికి ప్రభు త్వ పథకాలు అందేలా చూడాలన్నారు. నాణ్యతతో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారి చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు కరుణం పురుషోత్తంరావు, డీఆర్‌డీఏ పీడీ జాన్‌వెస్లీ, ఈఈ మనోహర్‌రావు, తాండూరు మైన్స్ ఏడీ రవికుమార్, డిప్యూటీ ఈఈ గోపినాథ్, వెంకటేశ్వర్లు ఉన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...