హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించాలి


Mon,July 15, 2019 11:47 PM

వికారాబాద్, నమస్తే తెలంగాణ: హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం నాటే మొక్కలను ౧౦౦కు ౧౦౦శాతం మొక్కలను రక్షించాలని కలెక్టర్ మస్రత్‌ఖానమ్ ఆయేషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌హాలులో హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటే విధానంపై అధికారులకు అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు వీడియో ద్వారా అవగాహన పరుస్తూ మొక్కలు నాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మొక్కలు నాటేందుకు అవసరమైన గుంతల సైజు, మొక్కలు నాటేటప్పు డు దానికి అడుగు భాగంలో ఉన్న ప్లాస్టిక్ బ్యాగును తొలగించుట తదితర విషయాలపై అవగాహన కల్పించారు. వర్షం కురిసేటప్పుడు మొక్కలు నా టకూడదని, మొక్కలు నాటిన తరువాత మట్టిని బాగా మొక్కు చుట్టు పోయాలని సూచించారు. కలెక్టర్ మొక్క లు నాటే విధానంపై అవగాహన కార్యక్రమాలను ౧౫,౧౬,౧౭ మూడు రోజుల పాటు అన్ని మండలాల్లో నిర్వహించాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులు తప్పనిసరిగా, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులకు శిక్షణ తరగతులకు తీసుకరావాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో అధికారులందరూ వారికి కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళిక ప్రకారం మొక్కలు నాటాలన్నారు. గత సంవత్స రం ౧౦౦కు ౩౭శాతం మొక్కులు మాత్రమే మిగిలాయని తెలిపారు.

ఈసారి ఖచ్చితంగా ౧౦౦కు ౧౦౦శాతం మొక్కలు బతికేటట్లు చూడాలన్నారు. దేవాలయాలు, మసీదులు, చర్చీలు, కళాశాలలు, పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రుల ఖాళీ స్థల్లా అందరు బాధ్యతతో ఇష్టంగా మొక్కలు నాటి వికారాబాద్ జిల్లాను స్వచ్ఛ హరిత జిల్లాగా మార్చాలన్నారు. ౭శాఖల అధికారులు ఒక గ్రూపుగా ఏర్పా టు చేసి అటవి శాఖ వారు గుంతలు తవ్వడం, మొక్కలు నాటడంపై ప్రాక్టికల్‌గా చూపడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అరుణకుమారి, డీఆర్‌వో మోతీలాల్, డీఆర్‌డీవో జాన్సన్, డీఎఫ్‌వో వేణుమాదవ్, వికారాబాద్, తాండూరు ఆర్డీవోలు విశ్వనాథం, వేణుమాదవరావుతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...