కొత్త సార్లొచ్చారు..


Tue,July 16, 2019 03:19 AM

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రభుత్వ పాఠశాలలకు కొత్త సార్లొచ్చారు. జిల్లా కు కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులందరూ సోమవారం విధుల్లో చేరారు. అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 256మంది ఉపాధ్యాయులు కొత్తగా ఎంపిక కాగా జిల్లాకు 166మందిని కేటాయిండం జరిగింది. అదే విధంగా జిల్లాకు 166 ఉపాధ్యాయులు కొత్తగా నియమితులుకాగా వీరి లో సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయుల వివరాలు.. అత్యధికంగా తెలుగుభాషా పండితులు-48 మంది ఉపాధ్యాయులు, సాంఘీక శాస్త్రం స్కూల్ అసిస్టెంట్లు-47మంది, స్కూల్ అసిస్టెంట్లు గణితం-29 మంది, బయోసైన్స్ స్కూల్ అసిస్టెంట్లు-23 మంది, స్కూల్ అసిస్టెంట్లు తెలుగు-15మంది, భౌతికశాస్త్రం స్కూల్ అసిస్టెంట్లు ముగ్గురు, స్కూల్ అసిస్టెంట్ ఉర్దు సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడిని జిల్లాకు కేటాయించారు. అయి తే జిల్లాలోని ఆయా మండలాల్లో సబ్జెక్టుల వారీ గా ఖాళీలను బట్టి కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులను విద్యాశాఖ అధికారులు కేటాయించారు. అయితే అత్యధికంగా బషీరాబాద్ మండలానికి 25మంది ఉపాధ్యాయులను కేటాయించ డం జరిగింది. కుల్కచర్ల మండలానికి 23మంది, దోమ మండలానికి 21మంది, తాండూర్ మండలానికి 16మంది, మర్పల్లి మండలానికి 13 మంది, కోట్‌పల్లి మండలానికి 12 మంది , పెద్దేముల్ మండలానికి 12మంది, యాలాల మండలానికి 9మంది, నవాబుపేట్ మండలానికి ఏడుగురు, ధారూర్ మండలానికి ఏడుగురు, బంట్వా రం మండలానికి ఏడుగురు, పరిగి, పూడూర్ మండలాలకు ఇద్దరు చొప్పున ఉపాధ్యాయులను ప్రభుత్వం కేటాయించింది. ఉపాధ్యాయుల కొర తతో జిల్లాలో 1100మంది విద్యావలంటీర్లతో భోధన కొనసాగిస్తూ వచ్చారు. అయితే నాణ్యమైన విద్యను అందించాలనే సదుద్దేశంతో ప్రభు త్వం ఉపాధ్యాయ నియామక ప్రక్రియను పూర్తి చేసి కొత్త ఉపాధ్యాయులను ఆయా జిల్లాల్లో ఖాళీలను బట్టి నియమించింది. అయితే ఎక్కడైతే కొత్త ఉపాధ్యాయులు నియామకమయ్యారో ఆ పాఠశాలల్లో విద్యావలంటీర్లను తొలగించనున్నారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...