కల్యాణలక్ష్మితో పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక సాయం


Wed,July 17, 2019 12:05 AM

వికారాబాద్ రూరల్ : పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక సాయ ం అందించి ఆదుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారని ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. మా ఇంటికీ రండి కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల పరిధిలోని గోధుమగూడ, సర్పన్‌పల్లి , గొట్టిముక్ల , బురాన్‌పల్లి, కామరెడ్డిగూడ, పాతూర్, పీరంపల్లి, కొటాలగూడ, సిద్దులూర్, పెం డ్లిమడుగు, పుల్‌మద్ది , ఎర్రవల్లి, అత్వేల్లి, మైలార్‌దేవరంపల్లి, పీలారం, రాళ్లచిట్టంపల్లి తదితర గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అలాగే ఆయా గ్రామాల్లోని స మస్యలను ప్రజలు అడిగి తెలుసుకొని వాటిని వెంటనే ప రిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పేదప్రజల ఆర్థిక అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా ఎందరో పేదవారికి లబ్ధి చేకూరిందన్నారు. గతంలో ఆడబిడ్డల పెండ్లిలు చే యాలంటే ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చేదన్నా రు. కానీ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకా న్ని ప్రభుత్వం ప్రవేశపెట్టాక పేదంటి ఆడబిడ్డల కు బాసటగా నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ముఖ్యంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకంతో ఆడబిడ్డల తల్లిదండ్రులు ఇబ్బందులు పడకుం డా కల్యాణలక్ష్మి ప్రభుత్వం అందజేస్తుందని ధీమాగా ఉ న్నారన్నారు. కల్యాణలక్ష్మి పథకం ప్రవేశపెట్టాక బాల్య వి వాహాలు పూర్తిగా తగ్గిపోయాయి అన్నారు. 18 ఏండ్లు నిం డకపోతే కల్యాణలక్ష్మికి అనార్హులు అవుతారన్నారు. పెండ్లి వయస్సు వచ్చాక పెండ్లిళ్లు చేస్తే కల్యాణలక్ష్మి వస్తుందన్నా రు. ఆయా గ్రామాల్లో 44 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశామన్నారు. కార్యక్రమంలో ఎం పీపీ చంద్రకళ, జడ్పిటీసి ప్రమోదిని ఆయా గ్రామాల సర్పంచు లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...