పండుగలా టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు


Wed,July 17, 2019 12:06 AM

పరిగి, నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం గ్రామాల్లో పండుగలా కొనసాగుతుందని ఎమ్మె ల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పరిగి మండల పరిధిలోని మల్లెమోనిగూడ గ్రామంలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పాల్గొని పలువురు కార్యకర్తలకు టీఆర్‌ఎస్ సభ్యత్వం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఇంటింటికీ టీఆర్‌ఎస్ సభ్యత్వం స్వీకరిస్తున్నారని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తుండడంతో పండుగలా సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుందని ఆయన అన్నారు. అయిదేండ్ల కాలంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకొని టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకునేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. ఈ నెల 20వ తేదీ లోపు గ్రామ కమిటీల ఎన్నికలు సైతం పూర్తి చేసుకొని గ్రామ స్థాయిలో టీఆర్‌ఎస్‌ను పటిష్టవంతమైన పార్టీగా తయారు చేస్తామన్నారు. ఎన్నికలు ఏవైనా టీఆర్‌ఎస్ ను ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. ము న్సిపల్ ఎన్నికలలోను టీఆర్‌ఎస్ విజ యం ఖాయమని, వివిధ పార్టీలకు చెందిన అనేక మంది టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముందుకు వస్తున్నారన్నారు. పరిగి మున్సిపాలిటీ పరిధి లో అభివృద్ధి పనుల కోసం మంజూరు చేయబడిన రూ. 15కోట్లకు సంబంధించి టెండర్ దశలో ఉందని, సాధ్యమైనంత త్వరగా పను లు ప్రారంభమయ్యేలా చూస్తామని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు బి. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్. ఆంజనేయులు, టీఆర్‌ఎస్ నాయకులు ఎ.సురేందర్‌కుమార్, ఎస్.భాస్కర్, ఎ.గోపాల్, మౌలానా, సూర్యనారాయణ, కార్యకర్తలు పాల్గొన్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...