అందరూ భాగస్వాములు కావాలి


Thu,July 18, 2019 12:17 AM

-మండలానికి హరితహార లక్ష్యం 12 లక్షల మొక్కలు
-ప్రతి ఒక్కరూ సుమారుగా5 మొక్కలను నాటి సంరక్షించాలి
-హరితహారంపై ప్రజాప్రతినిధులకు, అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎంపీడీవో రత్నమ్మ

పెద్దేముల్: గ్రామాల్లో ప్రతి ఒక్కరూ హరితహారం కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఎంపీడీవో రత్నమ్మ బుధవారం అన్నారు. మండల కేంద్రంలోని మం డల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులకు, గ్రామాల ప్రజాప్రతినిధులకు ఎంపీపీ అనురాధ అధ్యక్షతన హరితహారంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీడీవో రత్నమ్మ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమంలో గ్రామాల్లో అందరూ భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరూ విధిగా 5 మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. ముఖ్యంగా గ్రామం అనేది ప్రతి ఒక్కరికి జన్మస్థలం అని, అలాంటి గ్రామాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు మొక్కలను నాటాలన్నారు. చెట్లను ఎక్కువ శాతంలో నరికివేయడం వల్ల చెట్లు లేక, వర్షాలు సరిగ్గా కురవక భూగర్భజలాలు అడుగంటి తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడి, ఎండాకాలంలో సుమారు 45 డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకోలేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రతి ఒక్క అధికారి, ప్రజాప్రతినిధులు పూర్తిస్థాయిలో మారే విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని అన్నారు. మండలానికి హరితహారంలో భాగంగా 12 లక్షల మొక్కలను నాటాడానికి మనుకు లక్ష్యంగా ఇచ్చారని మండల పరిధిలోని ప్రతి గ్రామానికి ఆ గ్రామ జనాభా ప్రకారం సుమారు 20 వేల నుంచి 40 వేల మొక్కలను ఇవ్వడం జరుగుతుందని, ముఖ్యంగా ఈ మొ క్కలను గ్రామంలోని ప్రధాన కూడళ్ళల్లో, ప్రభుత్వ కార్యాలయాల వద్ద, గ్రామ రోడ్డుకు ఇరువైపుల, అవసరం ఉన్న చోట మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని తెలిపారు. వివిధ గ్రామాల సర్పంచ్‌లు ఎంపీటీసీలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని, సంరక్షణ పట్ల నిర్లక్ష్యం వహించరాదని, మా వంతు సహకారాన్ని గ్రామాల్లో అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ మధులత, జడ్పీటీసీ ధారాసింగ్, ఈవోఆర్డీ సుదర్శన్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఫీల్డ్ అసిస్టెంట్‌లు, టీఏలు, కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...