హరితహారాన్ని విజయవంతం చేయాలి


Thu,July 18, 2019 12:18 AM

యాలాల: హరితహారాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ చేయూత నందించాలని యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా అన్నారు. బుధవారం మండల పరిషత్తు కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రతి పంచాయతీకి ఓ నర్సరీని ఏర్పాటు చేసిందని, ఒక్కో నర్సరీలో దాదాపు 14 వేల మొక్కలను పెంచడం జరిగిందన్నారు. వర్షాలు ప్రారంభం కాగానే మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని, ఈ మొక్కలు ఎలా నాటాలి, ఎక్కడెక్కడ నాటాలి, గుంతలు ఎలా తవ్వాలి, వాటి రక్షణకు కమిటీలు ఎలా పనిచేయాలి మొదలగు విషయాలు శిక్షణలో అధికారులు తెలుపుతారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి హనుమంతరావు, వైస్ ఎంపీపీ రమేశ్, ఎంఈవో సుధాకర్‌రెడ్డి, ఏపీవో జనార్ధన్, ఎంపీడీవో నీరజా, సూపరింటెండెంట్ భాగ్యవర్ధన్, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వివిధ మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...