హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి


Thu,July 18, 2019 12:20 AM

-నాటిన మొక్కలను సంరక్షించాలి
-మండల ప్రత్యేకాధికారి పుష్పలత
బొంరాస్‌పేట : తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై మొక్కలు నాటాలని మండల ప్రత్యేకాధికారి పుష్పలత అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో హరితహారంపై నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో అడవుల విస్తీర్ణాన్ని పెంచడానికి ప్రభుత్వం ఐదేండ్లుగా హరితహారం కార్యక్రమం చేపడుతుందన్నారు. ఈ ఏడాది మరింత ఎక్కువ సంఖ్యలో మొక్కలు పెంచడానికి గ్రామానికో నర్సరీ చొప్పున నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలు పెంచామని అన్నారు. వర్షాలు ప్రారంభమైన వెంటనే మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, డ్వాక్రా మహిళలు, యువజన సంఘాలు, ప్రజలు ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో భాగస్వాములై మొక్కలు నాటాలని ఆమె కోరారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని కాపాడే బాధ్యతను తీసుకోవాలని పుష్పలత పేర్కొన్నారు. ఎంపీడీవో హరినందనరావు మాట్లాడుతూ అడవులు ఉంటేనే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని మొక్కలు నాటి అడవులను పెంచాలని కోరారు. వాతావరణం సమత్యులంగా ఉండాలంటే మొక్కలు విరివిగా నాటాలని సూచించారు. రైతులు పొలం గట్లపై టేకు మొక్కలు పెంచితే మంచి ఆదాయం వస్తుందని అన్నారు. అనంతరం మండల పరిషత్ ఆవరణలో మొక్కలు నాటే విధానం గురించి అటవీశాఖ అధికారులు సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ హేమీబాయి, వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, తహసీల్దార్ వరప్రసాదరావు, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యదర్శులు పాల్గొన్నారు.
సమాచారం ఇవ్వని అధికారులు
తెలంగాణకు హరితహారంపై బుధవారం ఏర్పాటు చేసిన సమావేశం, శిక్షణ గురించి అధికారులు మండలంలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మీడియాకు సమాచారం ఇవ్వలేదు. అటవీశాఖ అధికారులు నిర్వహించిన ఈ సమావేశం గురించి కనీసం సమాచారం ఇవ్వకపోవడం గురించి పలువురు సర్పంచ్‌లు సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారు.ఇంతటి ప్రాముఖ్యం ఉన్న సమావేశం గురించి సమాచారం ఎందుకు ఇవ్వలేదని వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి అధికారులను ప్రశ్నించారు. బుధవారం ఉదయం ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చారని పలువురు సర్పంచ్‌లు తెలిపారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...