జోరుగా టీఆర్‌ఎస్ సభ్యత్వాలు


Sun,July 14, 2019 01:41 AM

కొల్లాపూర్,నమస్తేతెలంగాణ: మండల పరిధిలోని కుడికిళ్లలో టీఆర్‌ఎస్ సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని జెడ్పీటీసీ జూపల్లి భాగ్యమ్మ, సింగిల్‌విండో చైర్మన్ జూపల్లి రఘుపతిరావులు శనివారం లాంచనంగా ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో సబండవర్గాల ప్రజల సంక్షేమ అభ్యున్నతికి ఎంతో కృషిచేస్తామన్నారు. సర్పంచ్ జ్యోతిరాము, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.ముమ్మరంగా టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుపాన్‌గల్:మండలంలోని వెంగళాయిపల్లి,నిజామాబాద్ గ్రామాలలో శనివారం మాజీ రవికుమార్ ఆధ్వర్యంలో ఇంటింటా టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్ర ముమ్మరంగా కొనసాగుతున్నది. మా జెడ్పీటీసీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గ్రామా చేపట్టిన అభివృద్ధి, పథకాల వల్ల ప్రజలకు ఎంతగానో మేలు కలిగిస్తున్నాయన్నారు. సమన్వయ సమితి గ్రామ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, మెంబర్లు మల్లెపు శాంతయ్య, సుజీవన్, తదితరులు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుపెద్దకొత్తపల్లి: మండల పరిధిలోని వెన్నచర్లలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదును ఎంపీపీ ప్రతాప్‌గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో సభ్యత్వాలు ఆయన అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు చేసుకు వారికి రూ.2లక్షల ప్రమాద బీమా ఉంటుందనిఅన్నారు. సర్పంచ్‌రాధిక, విండో చైర్మన్‌బాలస్వామి, ఎంపీటీసీ రవి, సర్పంచ్ భాస్కర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌నాయకులు బాల్‌లింగం తదితరులు పాల్గొన్నారు.

ముమ్మరంగా టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుకొల్లాపూర్‌టౌన్‌ః పట్టణంలో సభ్యత్వ నమోదును నియోజ ఏడు మండలాలతోపాటు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు శనివారం ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు, టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు చేయించారు. మొలచింతపల్లిలో జరిగిన సభ్యత్వ నమోదులో నాయకులు బాలస్వామిగౌడ్, సౌడయ్య, కర్రెన్న, వెంకటస్వామి తదితరులుపాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...