ఇసుక ట్రాక్టర్ కిందపడి బాలుడి మృతి


Sun,July 14, 2019 01:45 AM

లింగాల : మండలంలోని పద్మన్నపల్లి గ్రామానికి చెందిన నేణావత్ శ్రీరాం (2) అనే బాలుడు ఇసుక ట్రాక్టర్ కిందపడి మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, ఎస్‌ఐ రమేశ్ అజ్మీరా తెలిపిన వివరాల ప్రకారం.. ఇసుక లోడ్‌తో గ్రామంలోకి వచ్చిన ట్రాక్టర్ రివర్స్ తీసుకుంటు ండగా తోటి పిల్లలతో ఇంటి ముందర ఆడుకుంటున్న బాలుడిపైనుంచి ట్రాక్టర్ వెళ్లింది.

దీంతో అపస్మాకరక స్థితిలో ఉన్న బాలుడిని అచ్చంపేట దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకు న్నాయి. తమకు న్యాయం చేయాలని బాలుడి కుటుంబ సభ్యులు ఆందోళకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రమేశ్ సంఘటనా స్థలాన్ని చేరుకొని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇసుక ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మృతి చెందిన బాలుడిని పోస్టుమార్టం కోసం అచ్చంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బాలుడి తండ్రి నేణావత్ హేమ్లా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...