ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగస్వాములు కావాలి


Sun,July 14, 2019 01:47 AM

-అటవీ శాతాన్ని పెంచితేనే వర్షాలు కురుస్తాయి
-ఖిల్లాఘణపురం సర్పంచ్ వెంకటరమణ
ఖిల్లాఘణపురం : ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగస్వాములు కావాలని ఖిల్లాఘణపురం సర్పంచ్ వెంకటరమణ గ్రామస్తులకు సూచించారు. శనివారం మండల కేంద్రంలో ఉపాధి కూలీలతో కలిసి హరితహారంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అటవీ శాతం పెంచేందుకు హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టడం జరిగిందన్నారు. అం దులో భాగంగానే ఈ ఏడాది కూడా మొక్కలు నాటేందుకు అన్ని గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. అన్ని నర్సరీలలో హరితహారానికి మొక్కలు సిద్ధంగా ఉన్నాయని, అటవీ శాతాన్ని పెంచినప్పుడే వర్షాలు సక్రమంగా కురిసి పంటలు పండుతాయని అన్నారు. గ్రామాలలో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసి రోడ్లకు ఇరువైపుల మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు, ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...