కుటుంబ నియంత్రణను పాటించాలి


Fri,July 12, 2019 02:17 AM

చెన్నారావుపేట, జూలై 11 : కుటుంబ నియంత్రణను పాటిం చాలని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి మధుసూదన్ అన్నారు. గు రువారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవ వేడుకలను చెన్నారావుపేట జిల్లా పరిషత్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ర్యాలీని నిర్వహించా రు. ఈ ర్యాలీని ఎంపీపీ బాదావతు విజేందర్ జెండా ఊపి ప్రా రంభించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎంహెచ్‌వో మాట్లాడారు. రోజురోజుకూ జనాభా విపరీతంగా పెరిగిపోతుందన్నారు. జనాభా పెరగడం వల్ల కలిగే అనర్థాలను గ్రామీణ ప్రాంత ప్రజలకు వివరించాలని సూచించా రు. అనంతరం కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు జరిపినందుకు గానూ డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ మహేంద్రన్, ఉత్తమ వైద్య సేవలు అందించినందుకు గానూ డాక్టర్ సుధీర్, డాక్టర్ నాగశశికాంత్, డాక్టర్ విపిన్, డాక్టర్ గోపాల్, డాక్టర్ నవత, స్టాఫ్ నర్సులు షాహెదాబీ, ఫార్మాసిస్ట్‌లు శ్రీనివాసచారీ, సునీత, ఈశ్వరీ, ఏఎన్‌ఎంలు రమ, కృష్ణకుమారి, హెల్త్‌అసిస్టెంట్ చలపతి, ఆశ కార్యకర్తలు పద్మ, సుమలతకు ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. కార్యక్రమంలో ఎంపీపీ బాదావతు విజేందర్, జెడ్పీటీసీ బానోత్ పత్తినాయక్, వైస్ ఎంపీపీ కంది కృష్ణారెడ్డి, ఎంపీడీవో కొర్ని చందర్, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు మహ్మద్ అబ్ధుల్ గఫ్ఫార్, సర్పంచ్ కుండె మల్లయ్య, సొసైటీ చైర్మన్ రాధారపు సాంబరెడ్డి, మాజీ జెడ్పీటీసీ జున్నుతుల రాంరెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్ సుధీర్, జిల్లా మాస్ మీడియా అధికారిణి స్వరూపరాణి, నర్సంపేట ఏసీడీపీవో విద్య, సూపర్‌వైజర్ మంజుల, పీహెచ్‌సీ వైద్యాధికారి ఉషారాణి, జిల్లా పరిషత్ పాఠశాల హెచ్‌ఎం కుమారస్వామి, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం మల్లయ్య, సీహెచ్‌వో వెంకటేశ్వర్‌రావు, ఫార్మాసిస్ట్ రమాదేవి, స్టాఫ్ నర్సులు స్వరూపరాణి, శారద, హెల్త్ అసిస్టెంట్ కుండె శివాజీ, ఏఎన్‌ఎంలు, ఆశకార్యకర్తలు, ఇతర వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...