సీఎం కేసీఆర్, కేటీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం


Sun,July 14, 2019 02:00 AM

పరకాల, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చిత్రపటానికి పరకాల ప్రాంత టీఆర్‌ఎస్ నాయకులు శనివారం క్షీరాభిషేకం చే శారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొచ్చు వినయ్‌తోపాటు టీఆర్‌ఎస్ నాయకులు స్థానిక బస్టాండ్ సెంటర్‌లో కేసీఆర్, కేటీఆర్, ఎమ్మెల్యే చల్లా చిత్రపటాన్ని ఉంచి క్షీరాభిషేకం చేశారు. పరకాల మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు చేయ డంపై వారు సంతోషం వ్య క్తం చేశారు. ఈ సందర్భం గా వినయ్ మాట్లాడుతూ పరకాల పట్టణ అభివృద్ధి, సుందరీకరణ కోసం ఎమ్మె ల్యే చల్లా ధర్మారెడ్డి మంత్రి దయాకర్‌రావుతో కలిసి సీఎం కేసీఆర్, పార్టీ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు దృష్టికి తీసుకెళ్లి నిధులను తీసుకొచ్చారన్నారు. ఈ నిధులతో పట్టణం మరింత అభివృద్ధి తయారుకానుందన్నారు.

పరకాల పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ నిధులు మంజూ రు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు పరకాల ప్రాంత ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ బొల్లె భిక్షపతి, టీఆర్‌ఎస్ నాయకులు దగ్గు విజేందర్‌రావు, ఎర్రబెల్లి తిరుపతిరెడ్డి, చందుపట్ల రమణారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మార్త రాజభద్రయ్య, మాజీ కౌన్సిలర్లు వేణు, సంపత్‌కుమార్, దశరథం, టీఆర్‌ఎస్‌వీ నాయకుడు పోచంపల్లి రఘుపతి తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...