వ్యవసాయానికి పెద్దపీట


Sun,July 14, 2019 02:01 AM

నర్సంపేట, నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్ సభ్యత్వాల్లో నంబర్ వన్‌గా నిలవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 14 వవార్డుకు చెందిన టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు పుస్తకాలను నాయకులు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సమక్షంలో శనివారం కడియం శ్రీహరికి అప్పగించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ సభ్యత్వం కోటికి పైగా దాటుతుందని, అనుకున్న లక్ష్యం దాటి పోయిందని వివరించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పాటుపడుతున్నదని, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నదని అన్నారు. ఇందులోభాగంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని, ఎంతో మంది ఈ పథకాలతో లబ్ధి పొందారని వివరించారు. ఇంటింటికి తిరిగి సభ్యత్వాలను పెంచాలని కోరారు. జిల్లాలు, నియోజకవర్గాలకు మొదటి విడుతగా ఇచ్చిన సభ్యత్వాలు సరిపోలేదని, తిరిగి పుస్తకాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

ప్రతిఒక్కరూ టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని కడియం శ్రీహరి తెలిపారు. టీఆర్‌ఎస్ సభ్యత్వాలను కార్యకర్తలు, పార్టీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేయాలని, బూత్ లెవల్ నుంచి టీఆర్‌ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు పాటుపడాలని కోరారు. బూత్‌లెవల్, గ్రామస్థాయి, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ప్రజా ప్రతినిధులు ప్రజలకు స్థానికంగా అందుబాటులో ఉంటూ వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతీఒక్కరికి అందించేలా చూడాల్సి బాధ్యత కార్యకర్తలదేనని చెప్పారు. ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్‌ఎస్‌కు విజయం చేకూరే విధంగా చూడాల్సిన అవసరం ఉందని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు అండగా నిలిచారని అన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ చెట్టుపెల్లి మురళి, నాయకులు కామగోని శ్రీనివాస్‌గౌడ్,రామగోని సుధాకర్‌గౌడ్, నల్లా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...