రూ.23 కోట్లతో అభివృద్ధి పనులు


Mon,July 15, 2019 02:53 AM

-రూ.1.75 కోట్లతో మున్సిపల్‌ భవనం
-రేపు 28 పనులకు శంకుస్థాపన
-హాజరుకానున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
-20న వర్ధన్నపేటలో మెగా జాబ్‌మేళా
-ఎమ్మెల్యే అరూరి రమేశ్‌
వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ : నూతనంగా ఏర్పడిన వర్ధన్నపేట మున్సిపాలిటీలో రూ.23 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఈ నెల 16న శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ తెలిపారు. ఆదివారం నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని తండాలు, ఆవాసాలతో పాటు పట్టణ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.33 కోట్లు విడుదల చేసిందన్నారు. ఇంతకాలం ఎన్నికల కోడ్‌ వల్ల పనులను ప్రారంభించలేకపోయామన్నారు. ప్రజల ఇబ్బందులు, అవసరాలను గుర్తించి ఈ నెల 16న మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డుల్లో సుమారు 28 పనులకు భూమిపూజ చేయనున్నట్లు చెప్పారు. ప్రధానంగా సీసీరోడ్లు, సైడ్‌ డ్రెయిన్‌లు, అవసరమైన భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే వివరించారు.
హాజరు కానున్న మంత్రి దయాకర్‌రావు
వర్ధన్నపేట పట్టణంలో చేపట్టనున్న అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాలకు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు ఎమ్మెల్యే అరూరి తెలిపారు. ఉదయ 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిరాటంకంగా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ ఆవరణలో స్త్రీనిధికి సంబంధించి సుమారు రూ.1.97కోట్ల రుణాలను మహిళా సంఘాలకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ పోచా రం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్‌ హాజరుకానున్నట్లు ఎమ్మెల్యే వివరించారు.
రూ.1.75 కోట్లతో మున్సిపల్‌ భవనం
నూతనంగా ఏర్పడిన వర్ధన్నపేట మున్సిపాలిటీ భవనం కోసం ప్రభుత్వం రూ.1.75 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ మేరకు మండల పరిషత్‌ కార్యాలయ భవన సముదాయాల ఆవరణలో నూతనంగా నిర్మించే భవనానికి మంత్రి దయాకర్‌రావు భూమి పూజ చేస్తారని పేర్కొన్నారు. వర్ధన్నపేట పాత గ్రామ పంచాయతీ భవనాన్ని శాఖా కార్యాలయంగా వినియోగించుకుంటూ మున్సిపల్‌ భవనాన్ని మండల పరిషత్‌ కార్యాలయంలో అన్ని వసతులతో నిర్మించడం జరుగుతుందని చెప్పారు.

20న వర్ధన్నపేటలో జాబ్‌మేళా
వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో ఈనెల 20న మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే రమేశ్‌ తెలిపారు. ప్రముఖ ప్రైవేట్‌, ప్రభుత్వ కంపెనీలు ఇందులో పాల్గొంటున్నాయన్నారు. మండల కేంద్రంలోని లక్ష్మి, ఎంఎంఆర్‌, ఏబీఎస్‌ ఫంక్షన్‌హాళ్లలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యువతకు భోజన వసతిని కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ రైతు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మార్నేని రవీందర్‌రావు, జెడ్పీటీసీ మార్గం బిక్షపతి, నాయకులు గుజ్జ సంపత్‌రెడ్డి, ఎండీ అన్వర్‌, పూజారి రఘు, రహీం, ఇల్లందుల సుదర్శన్‌, తోటకూరి శ్రీధర్‌, భాస్కర్‌, వెంకన్న పాల్గొన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...