ఆరునెలల్లో ఆరుపోస్టులకు ఎంపికైన సాయిప్రసన్న..


Mon,July 15, 2019 02:55 AM

-పట్టుదలతో సివిల్‌, కమ్యూనికేషన్స్‌ ఎస్సై పోస్టులకు ఎంపిక..
నెక్కొండ : పక్కా ప్రణాళిక, నిర్ధిష్ట లక్ష్యంతో సుమారు ఆరేడు నెలల వ్యవధిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు ప్రభుత్వ కొలువులకు ఎంపికై పలువురు ఉద్యోగార్థులకు స్ఫూర్తిగా నిలుస్తోంది మండలంలోని చంద్రుగొండ గ్రామానికి చెందిన ఎర్ర సాయి ప్రసన్న. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ప్రసన్న తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహంతో కమ్యూనికేషన్స్‌ ఎస్సైగా, సివిల్‌ ఎస్సైగా ఎంపికయ్యారు. ఇప్పటికే మండలంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న సాయి ప్రసన్న ఉన్న ఉద్యోగంతో సంతృప్తి పడకుండా ఉన్నత స్థానాన్ని చేరుకోవాలనే లక్ష్యంతో పయనిస్తోంది. భద్రాచలంలో బీటెక్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంటెక్‌ పూర్తి చేసి సొంతంగానే ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమైంది. గతంలో వీఆర్వోగా ,బీట్‌ ఆఫీసర్‌గా ఎంపికైనప్పటికి ప ంచాయతీ సెక్రటరీ ఉద్యోగాన్ని ఎంచుకొని ఉద్యోగంలో చేరింది. తాజాగా ప్రకటించిన పోటీ పరీక్ష ఫ లితాల్లో ఏకంగా మూడు పోస్టులకు కమ్యూనికేషన్స్‌ కానిస్టేబుల్‌, కమ్యూనికేషన్స్‌ ఎస్సై, సివిల్‌ ఎస్సైగా సెలెక్ట్‌ అయింది. అయితే గ్రూపు-1 అధికారిగా పనిచేయాలనే తన కోరిక ఉండటంతో ప్రిపరేషన్‌కు వెసులుబాటు అధికంగా ఉండే కమ్యూనికేషన్స్‌ ఎస్సై పోస్టులో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెబుతోంది. తండ్రి సాంబయ్య చంద్రుగొండ సర్పంచ్‌గా ,ఎంపీటీసీగా , తల్లి నాగమణి సర్పంచ్‌గా గతంలో పనిచేశారు. వీరి ప్రోత్సాహంతోనే సాయి ప్రసన్న పోటీ పరీక్షల్లో ప్రతిభను చాటుతోంది.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...