దత్తత గ్రామాల్లో విద్యుత్‌ వెలుగులు


Mon,July 15, 2019 02:56 AM

-సమస్యల పరిష్కారంపై విద్యుత్‌శాఖ దృష్టి
-అధికారులకు గ్రామాల కేటాయింపు
-ఏఈ నుంచి డీఈ వరకు పల్లెల దత్తత
-జిల్లాలో 27 గ్రామాల దత్తత
-మూడు నెలల్లో కరంటు సమస్యలు దూరం
శాయంపేట, జూలై 14 : కరంటు సమస్యలంటే ఒకటి కాదు రెండు కాదు అనేకం వస్తుంటాయి.. ఒకటి పోతే మరో సమస్య తెరపైకి వస్తుంది. ఒక గ్రామంలో చూసే సరి కి మరో గ్రామంలో కరంటు సమస్యలు వస్తుంటాయి.. ప్రజల జీవనంలో కీలకమైన కరంటు లేనిదే పూట గడవని పరిస్థితి నెలకొన్నది. కరంటు సమ్యలను ఎప్పటికప్పుడూ పరిష్కారం చూపాల్సి వస్తున్నది. లేనట్లయితే ప్రజల మనుగడ చేయలేని పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో విద్యుత్‌ శాఖ సమస్యల పరిష్కారానికి వినూత్న నిర్ణయాలతో వెళ్తున్నది. పల్లెలను దత్తత తీసుకుని అక్కడ కరంటు సమస్య లు లేకుండా చేయాలన్న సంకల్పం పెట్టుకుంది. ఇందుకు అనుగుణంగా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. విద్యు త్‌ శాఖలో పనిచేస్తున్న ఏఈ నుంచి డీఈ వరకు ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ పల్లెలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 27 పల్లెలను విద్యుత్‌ అధికారులు దత్తత తీసుకున్నారు. ఆ గ్రామాల్లో కరంటు సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు. ఎలాంటి చిన్న సమస్యనైనా తీర్చాలన్న లక్ష్యంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఇందు కు కనీసం మూడు నెలల సమయం తీసుకుని దత్తత గ్రా మంలో కరంటు సమస్యలు పూర్తిగా లేకుండా చేయాలని చర్యలు చేపట్టారు. ఇప్పటికే నెల రోజులుగా ఇందుకు చర్యలు తీసుకుంటున్న అధికారులు దత్తతను సంపూర్ణం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

జిల్లాలో దత్తత గ్రామాలు ఇవే!
జిల్లాలో రూరల్‌ డివిజన్‌లో 27 పల్లెలను దత్తత తీసుకున్నారు. ఏఈ స్థాయి నుంచి ఏఈడీ, డీఈ వరకు దత్తత తీసుకుని సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. డీఈఈ మల్లిఖార్జున్‌ కాపులకనిపర్తి గ్రామా న్ని దత్తత తీసుకున్నారు. అలాగే పరకాల సబ్‌డివిజన్‌లో ఏడీఈ జగదీశ్‌బాబు నీరుకుళ్లను దత్తత తీసుకున్నారు. ఏఏఈలు రవికుమార్‌ కామారెడ్డిపల్లి, రాజ్‌కుమార్‌ ఐబోత్‌పల్లి, రాజమౌళి శాయంపేట, ఏఈ శిరీశ్‌ తక్కళ్లపాడు, రామకృష్ణ ఆరెపల్లి, వర్ధ్దన్నపేట సబ్‌ డివిజన్‌లో ఏడీఈ గణేశ్‌ ఎల్లంద, ఏఏఈ రవి రామవరం, ఏఏఈ రణధీర్‌రెడ్డి బూరుగుమళ్ల, ఏఈలు అజయ్‌ ఊకల్‌, రాజశేఖర్‌ రాయపర్తి, కాపులకనిపర్తి సబ్‌డివిజన్‌లో ఏడీ ప్రశాంత్‌ ఆశాలపల్లి, ఏఈఈలు సత్యనారాయణ మచ్చాపూర్‌, సంపత్‌రెడ్డి కీర్తినగర్‌, ఏఈ రాజు రామచంద్రాపూర్‌, ఏఏఈ శ్రీకాంత్‌ ఎల్గూర్‌రంగంపేట, నర్సంపేట సబ్‌డివిజన్‌లో ఏఈడీ అమరు రుద్రగూ డెం, ఏఏఈ శ్రీధర్‌ ద్వారకాపేట్‌, వీ శ్రీధర్‌ ముద్దునూర్‌, ఏఈ విజేందర్‌ ముంచిప్పుల, ఏఏఈ తిరుపతిరెడ్డి బాల్‌తండా, నెక్కొండ ఏడీఈ రాజు జీజీఆర్‌పల్లి, ఏఈ శ్రీనివాస్‌రెడ్డి పనికర, ఏఏఈ సూర్యభగవాన్‌ పాపాయ్యపేటను దత్తత తీసుకున్నారు.

కరంటు సమస్యలు లేకుండా చేసేందుకే దత్తత
- మల్లికార్జున్‌, డీఈఈ ఆపరేషన్‌, రూరల్‌
ఒక గ్రామాన్ని తీసుకున్ని ఆ గ్రామంలో ఉన్న విద్యుత్‌ సమస్యలను పూర్తిగా పరిష్కరించేందుకే గ్రామాలను దత్తత తీసుకున్నాం. ఇందుకు మూడు నెలల సమయం పెట్టుకుని ప్రణాళిక బద్ధంగా వెళ్తున్నాం. అటు వ్యవసాయ పరంగా, ఇటు గృహ అవసరాల పరంగా అన్ని సమస్యలను పరిష్కరించాలన్న లక్ష్యం ఉంది.
జిల్లాలో ఉన్న ఏఈలు, ఏడీఈలు అంతాకూడా దత్తత తీసుకునన్నారు. వారి వారి దత్తత పల్లెల్లో ఉన్న మేజర్‌, మైనర్‌ సమస్యలను తెలుసుకుని పరిష్కార దిశగా వెళ్తున్నాం. ఇప్పటికే దత్తత గ్రామంల్లో సర్వేచేసి డేటా తీసుకున్నాం. ఇప్పటికే చేయాల్సిన కొన్ని పనులను చేశారు. మరో నెలలోనే పనులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నాం. మేజర్‌, మైనర్‌ అన్ని సమస్యలను పూర్తిగా పరిష్కరించాలన్నదే ధ్యేయం. చిన్న గ్రామంలో త్వరగా పనులు పూర్తయినా, పెద్ద గ్రామంలో కొంత సమయం పడుతుంది. ఇలా పూర్తిస్థాయిలో కరంటు సమస్యల్లేని పల్లెలను చేస్తాము.

దత్తత పల్లెల్లో ఇవీ చేస్తారు
విద్యుత్‌ సమస్యల పరిష్కారం కోసం రూరల్‌ సర్కిల్‌లోని ఏఈ నుంచి డీఈ వరకు అందరు ఒక్కొ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అందులో కరంటు పరంగా ఉన్న ప్రతీ సమస్యను పరిష్కారం చేయాలని సంకల్పించారు. ఒకే సారి అన్ని గ్రామాల్లో సమస్యలను పరిష్కరించడం సాధ్యం కాదు. అందుకని కొన్ని గ్రామాలను దత్తత తీసుకున్నట్లు చెబుతున్నారు. అంటే గ్రామాల్లో ఉన్న చిన్న, పెద్ద సమస్యలన్నింటినీ పరిష్కరించి పూర్తి కరంటు సమస్యల రహిత గ్రామంగా మార్చనున్నారు. దత్తత గ్రామంలో లూజ్‌ లైన్లలలో మిడిల్‌ పోల్స్‌ కావాలంటే వేయించడం, పోల్స్‌ వంగి పోతే సరిచేయడం, దెబ్బతిన్న పోల్స్‌ వేయడం, మరమ్మతులు ఉంటే సరిచేయడం, కాలం చెల్లిన కండక్టర్లు ఉంటే కొత్తవి వేయడం, మీటర్లు ఆగిపోయినవి, కాలిపోయినవి, ఎక్కువ బిల్లింగ్‌ వస్తే పరిష్కారం చేస్తారు. వీధి లైట్లు లేకపోతే వేస్తారు. గ్రామంలో షాక్‌ వస్తున్నా, ఎర్తింగ్‌ ఉన్నా సరిచేస్తారు.

డీటీఆర్‌ గద్దెలు చిన్నగుంటే వాటిని పెద్దగా చేయడం, డైరక్టు సర్వీసులపై దృష్టి పెట్టడం, మీటర్లు లేని వారు ఉంటే వారినుంచి మీటరుకు డబ్బులు చెల్లిస్తే వెంటనే కొత్త మీటర్లు పెట్టడం, ట్రాన్స్‌ఫార్మర్‌ ఓవర్‌ లోడ్‌ అయితే మరో ట్రాన్స్‌ఫార్మర్‌ తెచ్చేందుకు ప్రతిపాదించి వెంబడే ట్రాన్స్‌ఫార్మర్‌ మార్పించడం చేస్తారు. దత్తత గ్రామానికి సంబంధించి గృహవసరాలకు, వ్యవసాయ కనెక్షన్లకు ఇబ్బంది లేకుండా చెట్లు అడ్డుగా ఉంటే కొట్టించడం, గ్రామంలో కరంటు పరంగా సర్వే చేయించి ఉన్న సమస్యలను లేకుండా బాగు చేయాలన్న ఉద్ధేశంతో చేస్తున్నట్లు చెబుతున్నారు. 3 ఆర్‌డీ వైరును ప్రొవైడ్‌ చేస్తారు. ఎలక్ట్రో మెకానికల్‌ మీటరు పెట్టడం, వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వడం వంటి 36 సమస్యలను పూర్తి దత్తత గ్రామంలో పరిష్కరిస్తారు. అయితే ఇప్పటికే దత్తత గ్రామంలో సర్వేచేసి డేటా సేకరించి చేయాల్సిన కొన్ని పనులను చేశారు. లూజ్‌ లైన్లు లేకుండా చేశారు, మిడిల్‌ పోల్స్‌ వేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే చిన్న గ్రామంలో తక్కువ సమస్యలుంటే తక్కువ సమయంలో పూర్తి చేస్తున్నారు. పెద్ద గ్రామంలో మాత్రం కొంత సమయం పడుతున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి మూడు నెలల సమయం తీసుకుంటు ఆలోగా పూర్తి చేయాలని నిర్ణయించారు.

జిల్లాలో ‘దత్తత’తో వెలుగులు..!
వరంగల్‌ రూరల్‌ జిల్లాలో విద్యుత్‌ శాఖ తీసుకున్న దత్తత నిర్ణయంతో ఆయా గ్రామాల్లో వెలుగులు రానున్నాయి. జిల్లాలో 400కుపైగా గ్రామాలున్నాయి. ఇక వరంగల్‌ రూరల్‌ సర్కిల్‌లో గృహ అవసరాలకు 1,70,772 సర్వీసులు కొనసాగుతున్నాయి. అలాగే జిల్లా పరిధిలో 75,872 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మొత్తంగా 2,65,616 సర్వీసులు ఉన్నట్లు చెబుతున్నారు. జిల్లా పరిధిలో వరంగల్‌ రూరల్‌, నర్సంపేట డివిజన్లు ఉండగా పరకాల, వర్ధన్నపేట, కాపులకనిపర్తి, నర్సంపేట, నెక్కొండ సబ్‌ డివిజన్లు ఉన్నాయి. రూరల్‌ సర్కిల్‌లో 20మంది ఏఈలు, ఆరు ఏడీఈలు, డీఈ ఒకరు ఉన్నారు. మొత్తంగా 27 మంది అధికారులు 27 మంది గ్రామాలను దత్తత తీసుకున్నారు. దత్తత గ్రామంలో మేజర్‌, మైనర్‌ సమస్యలను పరిష్కారం చేస్తారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...