రికార్డు స్థాయిలో సభ్యత్వాలు


Tue,July 16, 2019 05:07 AM

రాయపర్తి, జూలై 15 : రాష్ట్రంలోని నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా ఏర్పడిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం సమగ్రాభివృద్ధి, సంక్షేమాల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి విజయవంతంగా అమ లు చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్ మండల పార్టీ కార్యాలయంలో ఆయన మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహనాయక్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై పార్టీ గ్రామాల ఇన్ చార్జిలు, ప్రజా ప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజక వర్గా ల పరిధిలో టీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న పార్టీ సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తున్నట్లు చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం గత ఐదేళ్లుగా తన పరిపాలనాకాలంలో ప్రజలకు అవసరమైన పథకాలను చేపట్ట గా అన్ని ప్రాంతాలలోని ప్రజలు ఇంటికొకరు చొప్పున లబ్ధిదారులుగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ పథకాలతో ఫలాలు పొందిన ప్రజలంతా తాము టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో భాగస్వాములు కావాలన్న లక్ష్యంతోనే గులాబీ వనానికి దండు వలె వస్తున్నట్లు ఆయన వివరించారు. ఉద్యమాల పురిటి గడ్డ పాలకుర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాలకు చెందిన టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో సభ్యత్వ నమోదులో ముందు కు సాగుతున్నట్లు చెప్పారు. పార్టీ అధినేత రాష్ట్రంలోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 50 వేల సభ్యత్వాలు చేయాలని ఆదేశించగా పాలకుర్తిలో మాత్రం అందుకు భిన్నంగా లక్ష సభ్యత్వాలు నమోదు చేసి రికార్డులు నెలకొల్పాలన్న లక్ష్యం తో మండల శ్రేణులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు కృషి చేస్తున్నట్లు ఆయన వివిరించారు.

ప్రజా అవసరాలకు అనుగుణంగా నిర్మాణం..
పాలకుర్తి నియోజక వర్గంలోని అన్ని మండలాల్లో మండలంలోని అన్నివర్గాల ప్రజల అవసరాలకు అనుగుణంగా మండల కేంద్రాల్లో మండల కార్యాలయాలను నిర్మించాలన్న ఆలోచనలు చేస్తున్నట్లు మంత్రి దయాకర్‌రావు తెలిపారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అ ధికారి కార్యాలయం వెనుక వైపు ఉన్న తన సొంత ఖాళీ స్థ లంతో మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు వినియోగపడే విధంగా తన సొంత డబ్బులతో ఫంక్షన్ హాల్ నిర్మించాలని ఆయన తన అనుచరులను పురమాయించారు. అంతేగాక మండల కమిటీ అవసరాలకు వినియోగపడే విధంగా మండల కేంద్రంలో సర్వహంగులు, సకల సౌకర్యాలతో మండల కార్యాలయాన్ని తొందరలోనే నిర్మించేందుకు అహర్నిషలు పని చేయాల్సిందిగా మండల నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్ పార్టీ సభ్య త్వ నమోదు ఇన్‌చార్జి జన్ను జఖార్య, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జెడ్పీటీసీ రంగు కుమార్, నాయకులు బిల్లా సుధీర్‌రెడ్డి, గారె నర్సయ్య, అయిత రాంచందర్, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, చెవ్వ కాశీనాథం, గోవింద్‌నాయక్, తాళ్లపల్లి సంతోష్‌గౌడ్, పూస మధు, భాషబోయిన సుధాకర్, గజవెళ్లి ప్రసాద్, కుక్కల భాస్కర్, బద్దం రంగారెడ్డి, లక్కం సురేశ్, ముంజాల రవీందర్, నాగపురి సోమయ్య, గుగులోత్ జాజునాయక్, బోనగిరి ఉప్పలయ్య, చందు రాం యాదవ్, పూజారి సంతోష్, రాజు తదితరులున్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...