హరిత శోభితం.. 353 జాతీయ రహదారి


Fri,October 4, 2019 02:55 AM

శాయంపేట, అక్టోబర్ 03 : మండలంలోని 353 జాతీయ రహదారి హరిత శోభితంగా మారింది. రహదారికి రెండు వైపులా చెట్లు పెరిగి ఆహ్లాదకరంగా మారింది. కొత్తగట్టుసింగారం నుంచి గోవిందాపూర్ వరకు హైవే విస్తరించి ఉన్నది. అయితే రెండేళ్ల క్రితం హైవే విస్తరణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా రోడ్డుకు ఇరువైపులాఉన్న పెద్ద చెట్లను తొలగించాల్సి వచ్చింది. ఈ క్రమంలో విస్తరించిన రోడ్డుకు ఇరువైపులా మళ్లీ మొక్కలు నాటారు. ట్యాంకర్‌తో నీళ్లు పోసి పెంచారు. మొక్కలు చెట్లుగా పెరిగి హైవేపై ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...