బతుకమ్మ తల్లి స్ఫూర్తితో అభివృద్ధిలో ముందుకు వెళ్లాలి


Sat,October 5, 2019 04:15 AM

-ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి.. రాగంపేటలో విగ్రహం
ఖానాపురం, అక్టోబర్ 04 : బతుకమ్మ తల్లి స్పూర్తితో రాష్ర్టాన్ని సాధించుకున్నామని, అదే స్ఫూర్తితో అభివృద్ధిలో ముందుకు దూసుకువెళ్లాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రాగంపేటలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన బతుకమ్మ తల్లి విగ్రహాన్ని ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, సర్పంచ్ భాషబోయిన అయిలయ్యతో కలిసి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి, ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆగ్రగామిగా ఎదుగుతోందన్నారు. గ్రామస్తులు సుఖసంతోషాలతో ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ 30 రోజుల ప్రత్యేక ప్రణాళికను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. ఈ ప్రాంత ప్రజలకు పెద్దదిక్కైన పాకాలలోకి గోదావరి జలాలు తీసుకువచ్చే శుభ ఘడియ దగ్గరకొచ్చిందన్నారు. సీఎం ఆశీస్సులతో మరికొద్ది రోజుల్లోనే పాకాల ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు తెలిపారు. బతుకమ్మ తల్లి దీవెనలతో రాగంపేట ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం విగ్రహ దాతలైన వడ్డే సతీశ్, గుండా రామకృష్ణ, వీరస్వామిని శాలువాలతో ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గ్రామస్తులు రాజేశ్వర్‌రావు, కన్నె రాజు, బాలకృష్ణ, బూస అశోక్, సదర్‌లాల్ తదితరులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...