ప్రణాళికా పనులను పరిశీలించిన డీపీవో


Sat,October 5, 2019 04:16 AM

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ : మండలంలోని కట్య్రాల గ్రామంలో జరుగుతున్న 30 రోజుల ప్రణాళికా పనులను డీపీవో నారాయణరావు, డీఎల్పీవో స్వరూప శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. గ్రామంలోని చెరువు సమీపంలో పేరుకుపోయిన చెత్తను సర్పంచ్ సంపత్‌రెడ్డి ఆధ్వర్యంలో జీపీ సిబ్బంది తొలగిస్తున్నారు. ఈ క్రమంలోనే డీపీవో, డీఎల్పీవోలు ఆకస్మికంగా అక్కడికి చేరుకున్నారు. గ్రామంలో చేపట్టిన పనుల గురించి సర్పంచ్ వారికి వివరించారు. వీధుల్లో చెత్త వేయకుండా ప్రజలను చైతన్య పరచాలని అధికారులు సూచించారు. ఓ ఇంటి ఎదుట చెత్త పేరుకుపోవడంతో ఆ ఇంటి వారిని మందలించి, పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. లేకపోతే జరిమానాలు హెచ్చరించారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...