కార్యకర్తలకు అండగా ఉంటాం వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్


Sat,October 5, 2019 04:16 AM

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ : నిబద్ధతతో పనిచేసే ప్రతీ కార్యకర్తకు పార్టీ అధిష్టానం అండగా ఉంటుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండల కేంద్రానికి చెందిన సీనియర్ కార్యకర్త అకాల మరణం చెందడంతో ఆయన కుటుంబానికి ఎమ్మెల్యే రమేశ్ రూ.2 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదంలో వేల్పుల ఎల్లయ్య అకాల మరణం చెందడం బాధాకరమన్నారు. ఆయన కుటుంబానికి పార్టీతో పాటు తనవంతు కూడా సహకారం అందిస్తానన్నారు. అలాగే, ముఖ్యమంత్రి సహకారంతో సీఎంఆర్‌ఎఫ్ నుంచి రూ.2లక్షలను మంజూరు చేయించి ఆయన కుటుంబానికి అందజేసినట్లు తెలిపారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు తప్పకుండా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎంపీపీ అప్పారావు, జెడ్పీటీసీ భిక్షపతి, మాజీ ఎంపీపీ రవీందర్‌రావు తదితరులు ఉన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...