విజన్‌తో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి


Sat,October 5, 2019 04:17 AM

గీసుగొండ, అక్టోబర్ 04 : గ్రామస్తులంతా సమష్టిగా నిర్ణయాలు తీసుకోని విజన్‌తో ముందుకు సాగినప్పుడే పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతుందని సీఎం ప్రత్యే క కార్యదర్శి స్మిత సబర్వాల్ అన్నారు. తెలంగాణ ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక పనుల అమలు తీరును పరిశీలించేందుకు శుక్రవారం గీసుగొండ మండలంలో మరియపురం గ్రామాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో స్మిత సబర్వాల్ పాల్గొన్నారు. గ్రామంలో కమిటీల పనితీరు, ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు తీరును సర్పంచ్ అల్లం బాలిరెడ్డి ఆమెకు వివరించారు. ఈ సందర్భంగా మరియపురం గ్రామ బడ్జెట్, హరితహారం మొక్కలకు కేటాయించిన బడ్జెట్ వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో అన్నిరకాల మొక్కలను నాటి, వాటిని రక్షించాలని సూచించారు. గ్రామాభివృద్ధిలో ప్రజలు పూర్తిగా భాగస్వామలు కావాలన్నారు. గ్రామాభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక విజన్‌ను ఎంచుకోని పని చేయాలన్నారు. విద్యుత్ సమస్యల గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. గ్రామం లో లూజ్ వైర్లు ఉంటే వెంటనే సరి చేసి, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని ఆమె అధికారులను ఆదేశించారు. గ్రామంలో కమిటీలు సమర్థవంతంగా పనిచేయాలన్నారు.

గ్రామంలో పన్నుల వసూళ్లకు కమిటీని ఏర్పాటు చేసుకోవాలని, సరైన సమయంలో పన్నులు వసూలు అయ్యేలా ఆ కమిటీ చూసుకోవాలన్నారు. ఐదు సంవత్సరాల్లో గ్రామాభివృద్ధికి ఏం చేయాలో ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు. గ్రామ పరిశుభ్రతను ఇలానే కొనసాగించడానికి తీసుకుంటున్న చర్యల గురించి స్థానికులను అడిగారు. ప్రజలంతా కలిసి గ్రామాన్ని అభివృద్ధితో పాటు శుభ్రం చేసుకోవాలని సూచించారు. మరియపురాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలనే గ్రామస్తుల తపన అందరికీ ఆదర్శంగా ఉందన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే దోమలు లేకుండా ఉంటాయన్నారు. దోమలు లేని గ్రామంగా మరియపురం అభివృద్ధి చెందిందన్నారు. కార్యక్రమంలో రూరల్ కలెక్టర్ ముండ్రాతి హరిత, అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితరామచంద్రన్, ఆర్డీవో మహేందర్‌జీ, డీపీవో నారాయణరావు, డీఎల్‌పీవో స్వరూప, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ రాజుచౌహాన్, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఎంపీపీ భీమగాని సౌజన్య, జెడ్పీటీసీ పోలీసు ధర్మారావు, మండల పంచాయతీ అధికారి శేషాంజన్‌స్వామి, ఏపీవో మోహన్‌రావు, మిషన్ భగీరథ ఎస్‌ఈ శ్రీనివాస్, ఈఈ వెంకటరమణారెడ్డి, జిల్లా శిక్షణ మేనేజర్ కూసం రాజమౌళి పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...