గౌరమ్మతల్లి దయతో సుఖసంతోషాలతో జీవించాలి


Mon,October 7, 2019 03:45 AM

-జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి
శాయంపేట, అక్టోబర్ 06 : తొమ్మిది రోజులు గౌరమ్మతల్లిని పూజించి సాగనంపామని ఆ తల్లి దయంతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. శాయంపేట మం డలం పత్తిపాక, ప్రగతిసింగారం, వసంతాపూర్, కొప్పుల, పెద్దకోడెపాక గ్రామాల్లో ఆదివారం రాత్రి సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నా రు. ఈ సందర్భంగా మహిళలతో బతుకమ్మ ఆడారు. అనంతరం జ్యోతి మాట్లాడుతూ సద్దుల బతుకమ్మకు వర్షం పడటం శుభసూచకమని మహిళలను వరుణదేవుడు ఆశీర్వదించారని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతికి నిలమైన పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మకు ఎంతో ప్రాధాన్యం కల్పించిందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గా ల ప్రజలను సీఎం కేసీఆర్ గుర్తించారన్నారు. పండుగలకు అన్ని మతాల వారికి సమానంగా ఆదరిస్తున్నారన్నారు. తెలంగాణ అంటేనే బతుకమ్మ అని దేశంలో ఎక్కడా లేని విధంగా దేవుడికి పెట్టే పూలనే పూజించే అరుదైన సంస్కృతి తెలంగాణదని పేర్కొన్నారు. బతుకమ్మ పండుగకు ముందే ఆడపడుచులకు కోటి చీరెలను పంపిణీ చేశారన్నారు. అన్ని వర్గాల వారి అభివృద్ధి కోసం కేసీఆర్ సర్కారు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దసరాను ఉత్సాహంగా జరుపుకోవాలన్నారు. అనంతరం బతుకమ్మ వేడుకల్లో విజేతలకు గండ్ర జ్యోతి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ చిట్టిరెడ్డి రాజిరెడ్డి, పోతు సమలత, గోలి మాధు రి, అబ్బు ప్రకాశ్‌రెడ్డి, ఎంపీటీసీ ఐలయ్య, మేకల శ్రీనివాస్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గుర్రం రవీందర్, గంటా శ్యాంసుందర్‌రెడ్డి, పోతు రమణారెడ్డి, గోలి మహేందర్‌రెడ్డి, బుచ్చిరెడ్డి తదితరులున్నారు.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...