మంత్రి హరీశ్‌రావును కలిసిన ఎమ్మెల్యే రమేశ్


Mon,October 7, 2019 03:45 AM

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావును ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆదివారం హన్మకొండలోని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంట్లో కలిశారు. ఆదివారం హన్మకొండకు వచ్చిన మంత్రి హరీశ్‌రావును ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో పాటు టీఆర్‌ఎస్ రైతు విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మార్నేని రవీందర్‌రావు, ఆయన సతీమణి, ఐనవోలు ఎంపీపీ మార్నేని మధుమతితో కలిసి ఘనంగా శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హరీశ్‌రావు మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చిన సందర్భంగా ఆయనను కలసి సత్కరించినట్లు చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని పలు ప్రధాన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు. అలాగే అక్కడే ఉన్న విశాఖ శ్రీశారదాపీఠం ఉత్తరాధికారి శ్రీస్వాత్మానందేంద్ర స్వామీజీ ఆశీస్సులు కూడా తీసుకున్నారు. ఆయన వెంట నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...