దసరా వేడుకల్లో జమ్మిచెట్టు ప్రత్యేకత..


Tue,October 8, 2019 04:22 AM

చెన్నారావుపేట, అక్టోబర్ 07 : ప్రతీ ఏటా అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రజలు ఘనంగా జరుపుకునే విజయదశమి(దసరా) వేడుకల్లో జమ్మిచెట్టు(ఆకు) ప్రత్యేకత సంతరించుకుంటుంది. జమ్మి ఆకును విజయదశమికి చిహ్నంగా చెప్పుకోవచ్చు. దీని కోసం విజయ దశమి రోజు జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత ప్రజలు జమ్మి ఆకును తెంపుకోవడానికి తండోపతండాలుగా తరలివచ్చి తీసుకెళ్లడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఆకును నూతన వస్ర్తాల్లో కట్టుకోవడం, మరికొంతమంది ఇళ్ల మీద చల్లుకోవడం లాంటివి చేస్తారు. జమ్మిచెట్టుకు చారిత్రక నేపథ్యం ఉంది. పూర్వం రాజులు, చక్రవర్తులు విజయదశమి రోజునే యుద్ధాలు, దండయాత్రలు ప్రారంభించడానికి మంచి ముహూర్తంగా ఎన్నుకునేవారు. అర్జునుడు విజయదశమి రోజు జమ్మిచెట్టు పై నుంచి ఆయుధాలు తీసి కౌరవులపై యుద్ధం చేసి విజయం సాధించాడని మహాభారతం చెబుతోంది.

బహుళ విజయదశమి రోజున జమ్మిచెట్టు పూజలు చేయడం, ఆయుధ పూజ చేయడం అప్పటి నుంచే కొనసాగుతున్నట్లు పలువురు చెబుతున్నారు. అశ్వయుజ మాసంలో పౌడ్యమి నుంచి దశమి వరకు దసరా ఉత్సవాలు ఏటా జరుగుతాయి. చివరి రోజైన దశమిని విజయదశమి అంటారు. ఈ మాసంలో శరధృతువు ప్రారంభమవుతుంది. వర్షా లు వెలిసి ఆకాశం నిర్మలంగా ఉంటుం ది. రాత్రిళ్లు శరచంద్రుడు స్పష్టంగా దర్శనమిస్తాడు. వెన్నెల పిండి ఆరబోసినట్లు ఉంటుంది. వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. నిజానికి విజ యదశమిని నాటి రాజులు ఆర్థిక సంవత్సరానికి ప్రారంభదినంగా పాటించేవారని కథల ద్వారా తెలుస్తోంది.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...