దరఖాస్తుల ఆహ్వానం


Thu,October 17, 2019 03:35 AM

వరంగల్ క్రైం, అక్టోబర్16 : దీపావళి పండుగను పురస్కరించుకొని పటాకుల తాత్కాలిక విక్రయకేంద్రాల ఏర్పాటుకు కమిషనరేట్ పరిధిలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ బుధవారం పేర్కొన్నారు. వరంగల్ అర్బన్‌లో కాశీబుగ్గ వివేకానంద జూనియర్ కళాశాల, హన్మకొండ కాకతీయ డిగ్రీ కళాశాల, కాజీపేటలో వెంకటలక్ష్మి కూరగాయల మార్కెట్, బాపూజీనగర్, ఈస్ట్‌జోన్ (వరంగల్ రూరల్), వెస్ట్‌జోన్ (జనగాం) జిల్లాలో పటాకుల సామగ్రిని విక్రయించేందుకు ఆసక్తిగల వ్యాపారస్తులు సంబంధిత డీసీపీలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అగ్నిమాపక, మున్సిపల్ కార్పొరేషన్ విభాగాల నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవనే ధ్రువీకరణ పత్రాలతో పాటు పోలీస్ కమిషనరేట్ పేరిట రూ.800 ఎస్‌బీఐలో చలాన్ కట్టి ఈ నెల 21లోపు డీసీపీ కార్యాలయాల్లో దరఖాస్తులను అందజేయాలన్నారు. దరఖాస్తుదారుల ఆధ్వర్యంలో డ్రా తీసి షాపులను కేటాయించబడునని ఆయన పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే తాత్కాలిక విక్రయకేంద్రాల్లో అనుమతి ఇవ్వబడునని, అనుమతి లేకుండా పటాకులు విక్రయించే వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని సీపీ రవీందర్ హెచ్చరించారు. విక్రయదారులు తప్పనిసరిగా ఎక్స్‌ప్లోసివ్ చట్టానికి అనుగుణంగా ముందస్తు భద్రత చర్యలు పాటించాలని ఆయన సూచించారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...