మాట నిలబెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం


Fri,October 18, 2019 03:46 AM

నర్సంపేట, నమస్తే తెలంగాణ : గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకు రూ.8500 వేతనం పెం చుతున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాటను నిలబెట్టుకున్నారని, అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం 51 జీవోను విడుదల చేసిందని టీఆర్‌ఎస్‌కేవీ జిల్లా అధ్యక్షుడు గోనే యువరాజు తెలిపారు. గురువారం నర్సంపేటలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జీవోను పంచాయతీ రాజ్‌శాఖ ద్వారా అన్ని ఎంపీడీవో కార్యాలయాలకు జారీ చేశారన్నారు. కార్మికుల వే తనాలు పెంచడానికి కృషి చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి టీఆర్‌ఎస్‌కేవీ తరుఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామ పంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దుటకు ప్రతీ నెల రూ.339 కోట్లు గ్రామ పంచాయతీలకు కేటాయిస్తున్నారని యువరాజ్ చెప్పారు.

గత ప్రభుత్వాలు కార్మికులకు వేతనాలు కూడా ఇవ్వకుండా పంచాయతీ నుంచి వచ్చే ఆదాయంలో 30 శాతం నిధుల నుంచి వేతనాలు తీసుకోవాలని జీవో ఉండేదని గుర్తు చేశారు. దానితో ఏ ఒక్క కార్మికుడికి రూ.మూడు, నాలుగు వేలకు మించి వేతనాలు రాకపోయేవని అన్నారు. ఈ వేతనం కూడా నెలల తరబడి పెండింగ్‌లో ఉండేదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గ్రామ పంచాయతీ కార్మికులు రుణపడి ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో పాలడుగు రమేశ్, కాసు యాకయ్య, లక్ష్మీనారాయణ, రాజు, యాకూబ్‌పాషా, రాములు, రాజాలు, కుమారస్వామి, వెంకటాచారి, పాపయ్య తదితరులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...