శానిటేషన్ నిర్వహణ సక్రమంగా చేయాలి


Fri,October 18, 2019 03:46 AM

పరకాల, నమస్తే తెలంగాణ : గ్రామాల్లో శానిటేషన్ నిర్వహణ సక్రమంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో 30 రోజుల ప్రణాళికపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వారం గ్రామ ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన గ్రామాలను సందర్శించాలని అ న్నారు. మండల ప్రత్యేక అధికారులకు సందర్శించి మొ క్కల పెంపకం, నర్సరీల వివరాలు సేకరించాలన్నారు. ప్రతి మంగళవారం గ్రామ ప్రత్యేక అధికారులు సందర్శించిన రిపోర్టులను మండల ప్రత్యేక అధికారులకు అం దించాలని ఆదేశించారు. రోడ్లపై, ఇళ్ల ముందు చెత్త వేయకుండా చూడాలని సూచించారు.

గ్రామాల్లో శానిటేషన్ భాగాలేకపోతే స్పెషల్ ఆఫీసర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మండల ప్రత్యేక అధికారులు కూడా గ్రామాలను సందర్శించాలని చెప్పా రు. గ్రామాల్లో విద్యుత్ అవసరాలకు సంబంధించి 30 రోజుల ప్రణాళికలో సేకరించిన సమాచారాన్ని మండలాల వారీగా ఎంపీవోలు, డీఎల్‌పీవోలను అడిగి తెలుసుకున్నారు.

అవసరంలేని ఆర్‌డబ్ల్యూఎస్ బోర్‌వెల్స్ విద్యుత్ కనెక్షన్లను తీసివేయాలని, దీంతో గ్రామపంచాయతీలకు విద్యుత్ బిల్లులు తగ్గుతాయని చెప్పారు. శ్మశానవాటికలు అన్ని గ్రామపంచాయతీల్లో ఉండాలని, శిఖం భూములు లెక్కలోకి రావని, శిఖం భూముల్లో శాశ్వత నిర్మాణాలు చేపట్టేందుకు వీలులేదని అన్నారు. గ్రామాల్లో శ్మశాన వాటికలకు పది రోజుల్లో భూమి కొనుగోలు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంటే గ్రామపంచాయతీ పేరున మార్చేందుకు జీపీ వారీగా ప్రతిపాదనలు వారం రోజుల్లో సమర్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్డీవో సంపత్‌రావు, డీపీవో నారాయణరావుతోపాటు జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...