ఇంటింటికి తడి, పొడి చెత్త బుట్టలను అందించాలి


Sun,October 20, 2019 04:14 AM

-30 రోజుల ప్రణాళిక నిరంతరం కొనసాగాలి
-ఆదర్శ గ్రామానికి రూ.లక్ష అందిస్తాం
-సమీక్షలో జిల్లా పరిషత్ సీఈవో రాజారావు
శాయంపేట, అక్టోబర్ 19 : ప్రతి ఇంటికి తడి, పొడి చెత్తకు వేర్వేరుగా రెండు బుట్టలను అందజేయాలని జిల్లా పరిషత్ సీఈవో రాజారావు అన్నారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో 30 రోజుల ప్రణాళిక అమలుపై శనివారం సర్పంచ్‌లు, ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు, ఎఫ్‌ఏలు, ఈజీఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల వారీగా అమలును సీఈవో అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళికను నిరంతరం కొనసాగించాలన్నారు. ప్రతి మంగళవారం గ్రామాలకు కేటాయించిన ప్రత్యేక అధికారులు సందర్శించి ప్రణాళిక అమలును పర్యవేక్షణ చేయాలన్నారు. ఒక్కో బుట్టను రూ.56 చొప్పున జీపీ నుంచి ఖర్చు చేసి ఎన్ని కావాలో కొనుగోలు చేసి అందజేయాలన్నారు. ప్రతి ఊరిలోను శ్మశానవాటిక, డంపింగ్‌యార్డులను నిర్మించాలన్నారు. ఈనెల 25 లోగా ఇందుకు సంబంధించిన తీర్మానాలను గ్రామ పంచాయతీలు పంపించాలన్నారు. ఉపాధి హామి పథకంలో వీటికి సాంక్షన్ తీసుకోవాలని పేర్కొన్నారు. ఇందుకు ప్రభుత్వ స్థలం లేకపోతే ప్రవేటు స్థలం తీసు కోవాలని సూచించారు. అయితే చెరువు శిఖం భూముల్లో వీటిని నిర్మించవద్దని స్పష్టం చేశారు. మండలానికి ఒక ఆదర్శ గ్రామాన్ని ఎంపిక చేసి వచ్చే జనవరి 26కు రూ.లక్ష పారితోషికం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఈవో తెలిపారు. వంద శాతం మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, పరిశుభ్రత తదితర అన్నింటిని పూర్తి చేసుకున్న ఒక గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఎంపిక చేసి పంచాయతీకి పారితోషికాన్ని కలెక్టర్ ఆధ్వర్యంలో అందిస్తామన్నారు. అన్ని గ్రామాల సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు ఆదర్శ గ్రామంగా ఎంపికయ్యేందుకు కృషి చేయాలని సూచించారు. 30 రోజుల ప్రణాళికపై ఎప్పటికప్పుడు సమీక్ష ఉంటుందని తెలిపారు. ఇది నిరంతం కొనసాగే ప్రక్రియ అని గ్రామ స్పెషలాఫీసర్లు ప్రత్యేక శ్రద్ధ్ద పెట్టాలన్నారు. సమావేశంలో ఎంపీడీవో సుమనవాణి, ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, ఈవోపీఆర్‌డీ సరస్వతి, అధికారులు, పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...