టీఆర్‌ఎస్ సభ్యత్వాలను త్వరగా పూర్తి చేయాలి


Fri,July 19, 2019 03:54 AM

చెన్నారావుపేట,జూలై18: టీఆర్‌ఎస్ సభ్యత్వాలను గ్రామాల్లో త్వరగా పూర్తి చేయాలని మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ గఫార్ అన్నారు. గురువారం మండలంలోని అక్కల్‌చెడ గ్రామం లో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, నాయకులు ఉద్యమ స్ఫూర్తితో సభ్యత్వాలను వేగవంతంగా చేపట్టాలన్నా రు. సీఎం కేసీఆర్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు కాటి రాంబాబు, ఒం టరి రాములు, కోరె రమేశ్, పడిదం రాజేందర్, కాటి హరీశ్, పాలడుగు ల యాకయ్య, మల్లమ్మ, పెండ్యాల యాకయ్య, ఒంటరి బిక్షపతి, పద్మ, మైబెల్లి పాల్గొన్నారు.

నర్సంపేట రూరల్ : టీఆర్‌ఎస్ బలోపేతానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని నల్లబెల్లి మాజీ ఎంపీపీ బానోతు సారంగపాణి కోరారు. మండలంలోని కమలాపురం గ్రామంలో పలువురు నాయకులకు ఆయ న సభ్యత్వాలను అందజేశారు. ఈ సందర్భంగా సారంగపాణి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదులో అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు వేగం పెంచాలన్నారు. కార్యక్రమంలో నాయకులు మండల కుమారస్వామి, దండిగ రమేశ్, రమేష్, రవి, సారంగం, తిరుపతి, వెంకటేశ్, కొమ్మాలు, నర్సింహరాములు, చంద్రమౌళి, వెంకన్న పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...