నర్సంపేటకు మహర్దశ


Fri,July 19, 2019 03:55 AM

నర్సంపేట,నమస్తేతెలంగాణ : నర్సంపేట పట్టణానికి మహర్దశ పట్టనుంది. తెలంగాణ ప్రభుత్వం టీయూఎఫ్‌ఐడీసీ పథకంలో నిధుల వరదను పారిస్తోంది. కొన్ని నెలల కిందట పట్టణానికి రూ.35 కోట్లు మంజూరు చేసింది. తాజాగా గురువారం మరో రూ.15 కోట్లు విడుదల చేసింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నర్సంపేట అభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నర్సంపేటను అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో పట్టణానికి నిధులను మంజూరు చేయించారు. ఇప్పటివరకు మొత్తం టీయూఎఫ్‌ఐడీసీ నిధులు రూ.50 కోట్లు మంజూరు చేయించారు. పట్టణంలో పేరుకపోయిన సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో తీర్చేందుకు ఈ నిధులతో పనులు చేయిస్తున్నారు. తా జాగా మంజూరైన నిధులతో 100 శా తం సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఇతర మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. గతంలో మంజూరైన నిధులతో పట్టణంలో సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. కుమ్మరికుంట పార్క్, ఆడిటోరియం, సెంట్రల్ లైటింగ్, ఎత్తు డివైడర్లు, ఇనుప జాలీలు, బీటీ రెన్యువల్, శ్మశానవాటికల నిర్మాణం,స్లైడ్ డ్రైనేజీల నిర్మాణం, మొక్కల పెంపకం లాంటి పనులను చేపడుతున్నారు. ప్రస్తుతం డ్రైనేజీ, డివైడర్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అంతేకాకుం డా నర్సంపేటలో వివిధ కుల సంఘాల భవనాలను కూడా నిర్మిస్తున్నారు. ఇటీవలే నర్సంపేటలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్యటించి, సమీక్ష కూడా నిర్వహించారు. దీనిలో అదనంగా రూ.15 కోట్లు మంజూరు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే పెద్ది సూచించిన పనులను త్వరగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీనిలో భాగంగా కొత్తగా రూ. 15 కోట్లు విడుదల చేస్తూ జీవో నంబర్ 484 కాపీని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి హైదరాబాద్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అందించారు. కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో పాటు నర్సంపేట నాయకులు పాల్గొన్నారు. కాగా, నర్సంపేట ప్రాంత సమస్యలను పెద్ది సుదర్శన్‌రెడ్డి అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించారు. నర్సంపేటను మోడల్ సిటీగా మార్చేందుకు ముందుకు కదులుతున్నారు.

71
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...